ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 జులై 2020 (11:34 IST)

కిక్ నటుడు శ్యామ్ అరెస్ట్.. పోలీస్‌గా నటించాడు.. గ్యాంబ్లింగ్‌కి పాల్పడ్డాడు..

Shyam
ప్రముఖ సినీ నటుడు కిక్, రేసుగుర్రం సినిమా ఫేమ్ అయిన శ్యామ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని కోడంబాక్కంలో పోకర్ క్లబ్ నడుపుతున్న శ్యామ్... గ్యాంబ్లింగ్‌కి పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎటువంటి అనుమతులు లేకుండా పేకాట, బెట్టింగులు నిర్వహిస్తుండటంతో కేసు నమోదు చేశారు. 
 
తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన శ్యామ్ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం, కిక్- 2 వంటి చిత్రాలలో నటించాడు శ్యామ్. ఎక్కువగా దర్శకుడు సురేంద్ర రెడ్డి సినిమాల్లో కనిపించాడు. కిక్ సినిమాలో అతడు మంచి పాత్ర వేయడంతో తెలుగు జనాల్లో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
 
నటుడు శ్యామ్ రవితేజ నటించిన కిక్ సినిమాలో పోలీసుగా నటించాడు. అతడి నటనతో మంచి పాత్రలనే దక్కించుకున్నాడు. అలాగే రేసుగుర్రం సినిమాలోనూ పోలీస్ ఆఫీసరుగా నటించాడు. అలాంటి వ్యక్తి పేకాట, బెట్టింగ్ పేరుతో గ్యాంబ్లింగ్‌కు పాల్పడటం సంచలనం రేపింది.