ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 మే 2023 (15:54 IST)

చెన్నైలో సీనియర్ నటుడు శరత్ బాబు అంత్యక్రియలు

sarath babu
సీనియర్ నటుడు శరత్ బాబు అంత్యక్రియలు చెన్నైలో జరుగనున్నాయి. శ‌ర‌త్ బాబు మృతి ప‌ట్ల ప‌లువురు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నేత‌లు తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేస్తున్నారు. శ‌ర‌త్ బాబు పార్థీవ దేహాన్ని సోమ‌వారం మ‌ధ్యాహ్నం ప్రేక్ష‌కుల సంద‌ర్శ‌నార్థం ఫిలింఛాంబ‌ర్‌కు తీప‌సుకొచ్చారు. 
 
అనంత‌రం చెన్నైకి త‌ర‌లించారు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా, విల‌న్‌గా స‌త్తాచాటిన శ‌ర‌త్ బాబు చివ‌ర‌గా న‌రేష్‌, ప‌విత్ర లోకేష్ క‌లిసి న‌టించించిన "మ‌ళ్లీ పెళ్లి" మూవీలో సూప‌ర్ స్టార్ కృష్ణ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. 
 
ఇదే ఆయ‌న చివ‌రి చిత్రం. చెన్నైలో నేడు శ‌ర‌త్ బాబు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. శ‌ర‌త్ బాబుకు పిల్ల‌లు లేరు. దీంతో ఆయ‌న అంత్య‌క్రియ‌లు ఎవ‌రు చేస్తార‌న్న‌ది తెలియాల్సి వుంది.