జననేత కనిపిస్తే, రాజకీయాలకు రెడీ.. హీరో సుమన్
రాజమండ్రి : సామాన్యుడిని సంతోషంగా ఉంచే నాయకుడు కనిపిస్తే రాజకీయాల్లోకి వస్తానని సినీ నటుడు సుమన్ న్నారు. రాజమండ్రిలో ఒక కార్యక్రమానికి హాజరైన సుమన్ మీడియాతో మాట్లాడుతూ, తన మనసులోని మాటను చెప్పారు. కొత్త రాజకీయ పార్టీ కోసం ఎదురు చూస్తున్నట్
రాజమండ్రి : సామాన్యుడిని సంతోషంగా ఉంచే నాయకుడు కనిపిస్తే రాజకీయాల్లోకి వస్తానని సినీ నటుడు సుమన్ న్నారు. రాజమండ్రిలో ఒక కార్యక్రమానికి హాజరైన సుమన్ మీడియాతో మాట్లాడుతూ, తన మనసులోని మాటను చెప్పారు. కొత్త రాజకీయ పార్టీ కోసం ఎదురు చూస్తున్నట్లు సుమన్ మాటల్లో వెల్లడి అవుతోంది.
ఇప్పటివరకూ వివిధ భాషల్లో 400 చిత్రాలకు పైగా నటించినట్టు సుమన్ చెప్పారు. సైనికుడు, రైతు, డాక్టర్ పాత్రలతో పూర్తిస్థాయి చిత్రంలో నటించాలన్నది తన కోరికన్నారు. సైనికుడు లేని దేశాన్ని ఊహించలేమని, రైతు లేకుంటే ఒక్కరోజు గడవదని, పునర్జన్మను ప్రసాదించే డాక్టర్ వృత్తి అంటే తనకు ఎంతో గౌరవమని చెప్పారు.