గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (15:34 IST)

ఇతడిని కూడా వదిలేశా... మీరు ఏమనుకున్నా ఫర్లేదు... నటి స్టేట్మెంట్

బాలీవుడ్ బిగ్ స్క్రీన్ నటులే డేటింగ్, బ్రేకప్స్ చెపుతుంటారని అనుకుంటాం కానీ, ఇప్పుడు బుల్లితెర నటీనటులు కూడా అదే రూటులో వెళ్తున్నారు. తాజాగా బుల్లితెర నటి అదితి రాథోర్ తన బోయ్ ఫ్రెండు తనకు నచ్చలేదని అందువల్ల అతడితో బ్రేకప్ చెప్పేసినట్లు ఇన్‌స్టాగ్రాం

బాలీవుడ్ బిగ్ స్క్రీన్ నటులే డేటింగ్, బ్రేకప్స్ చెపుతుంటారని అనుకుంటాం కానీ, ఇప్పుడు బుల్లితెర నటీనటులు కూడా అదే రూటులో వెళ్తున్నారు. తాజాగా బుల్లితెర నటి అదితి రాథోర్ తన బోయ్ ఫ్రెండు తనకు నచ్చలేదని అందువల్ల అతడితో బ్రేకప్ చెప్పేసినట్లు ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. 
 
శ్రీధరన్ సింగ్ అనే బాడీ బిల్డర్‌తో ఆమె గత ఏడెనిమిది నెలలుగా డేటింగ్ చేస్తోంది. కానీ ఇంతలోనే అతడిలో ఏం నచ్చలేదో తెలియదు కానీ బ్రేకప్ చెప్పేస్తున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని చెపుతూ... అతడికి బ్రేకప్ చెప్పడం తనను ఎవరేమైనా అనుకున్నా లెక్కచేయనని కూడా చెప్పేసింది. మరీ అలా చెబితే ఎవరైనా ఏం మాట్లాడుతారులెండి.