సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2017 (17:22 IST)

ప్రియుడిని ఇంటికి రమ్మని వంట చేయమంది.. నో చెప్పేసరికి కత్తితో పొడిచేసింది..

ప్రేమించుకున్నారు. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. వంట చేసి పెడతానని ప్రేయసి ఇంటికి రమ్మంది. ప్రియుడు కూడా అంతే సంతోషంగా వెళ్లాడు. కానీ అక్కడికి వెళ్లాక ప్రేయసి గొడవకు దిగింది. వంట ప్రియుడిని చేయమంది. ద

ప్రేమించుకున్నారు. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. వంట చేసి పెడతానని ప్రేయసి ఇంటికి రమ్మంది. ప్రియుడు కూడా అంతే సంతోషంగా వెళ్లాడు. కానీ అక్కడికి వెళ్లాక ప్రేయసి గొడవకు దిగింది. వంట ప్రియుడిని చేయమంది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రియుడు ప్రేయసిపై చేజేసుకున్నాడు. అంతే కోపంతో ప్రేయసి కూడా వంటింట్లో ఉన్న కత్తితో ప్రియుడిని పొడిచేసింది. చివరికి క్షణికావేశంతో జరగాల్సిందంతా జరిగిపోయింది. ప్రియుడు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. ప్రేయసి పోలీసుల చేతిలో దొరికిపోయింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ, ఉత్తమ్ నగర్‌లో ఉజుమ్మా అనే యువతి మూడు నెలల పాటు నివాసం ఉంటోంది. ప్రియుడు ఏజు (30)ను తన ఇంటికి ఆహ్వానించింది. అతను ఇంటికొచ్చాక ఇద్దరి మధ్య వంట ఎవరు చేయాలనే వివాదం ముదిరింది. ఇద్దరూ పోటీపడ్డారు. దీంతో కోపంతో ఏజు ఆమెపై దాడి చేశాడు. ప్రియుడు చేజేసుకోవడాన్ని తట్టుకోలేని ప్రేయసి వంటింటి నుంచి కత్తిని తెచ్చి బెదిరించింది. దీంతో మరోసారి ఏజు ఆమెపై చేయిచేసుకున్నాడు. 
 
అంతే ఏజును ఉజుమ్మా అతనిని కత్తితో పొడిచేసింది. ఏం జరిగిందని చూసుకునేలోపే.. క్షణికావేశంలో జరగాల్సిందంతా జరిగిపోయింది. ఆపై ఏజును ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అతను అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో నిందితులి రాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు.