బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 25 డిశెంబరు 2018 (12:29 IST)

ప్లీజ్... అడ్డుకోండి, వాళ్లు నన్ను వేధిస్తున్నారు... సినీ నటి అపూర్వ

సోషల్ మీడియాలో తనపై ట్రోల్ చేస్తున్న వ్యక్తులపై సినీనటి అపూర్వ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. దెందులూరు టీడీపీ ఎంఎల్ఏ చింతమనేని అనుచరులపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు అపూర్వ. గతంలో తాను ఎమ్మెల్యే చింతమనేనిపై చేసిన వ్యాఖ్యలకు దృష్టిలో పెట్టుకొని ఆయన అనుచరులు తనను వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 
 
తన కుటుంబ వ్యవహారాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె తెలిపింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న టీడీపీ నాయకులను కట్టడి చెయ్యాలని ఆమె కోరింది.