తల్లి కాబోతున్న హరితేజ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
యాంకర్, బిగ్ బాస్ ఫేమ్, నటి హరితేజ త్వరలోనే తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించారు. తాను త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నానని.. తనకు ఎంతో ఆనందంగా ఉందని ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెట్జన్లు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇటీవల లాక్‌డౌన్‌లో ఆమె ఇంటికే పరిమితమయ్యారు.
బిగ్ బాస్ హౌస్ ద్వారా హరితేజ ఎంతో పాపులర్ అయ్యారు. అంతకుముందు కూడా ఆమె పలు సీరియళ్లు కార్యక్రమాలు చేసి తనకంటూ ఓ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత ఆమెకు సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. 'అఆ' సినిమాలోని పనిమనిషి పాత్ర ఆమెకు గుర్తింపు తీసుకొచ్చింది. స్టార్ మా జెమినీ ఈటీవీ లాంటి చానల్స్‌లో ఆమె ఎన్నో విభిన్నమైన కార్యక్రమాలకు యాంకరింగ్ చేశారు.
బిగ్ బాస్ సీజన్-1లో హరితేజ ఎంతో అలరించారు. ఆమె ఫైనల్ రౌండ్ దాకా హౌజ్‌లో కొనసాగారు. హరితేజ విజేతగా నిలుస్తారని అంతా భావించారు. కానీ చివర్లో ఓటింగ్ విషయంలో వెనక్కి వచ్చేశారు. బిగ్ బాస్ హౌస్‌లో ఆమె చెప్పిన బుర్రకథ ప్రేక్షకులను ఎంతో అలరించింది. హరితేజలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? అంటూ పలువురు ఆమెను మెచ్చుకున్నారు. ఇకపోతే.. తాజాగా హరితేజ తల్లి కాబోతుండటంతో పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.