మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2018 (13:21 IST)

కన్నుగీటే సన్నివేశాన్ని అప్పటికప్పుడే చేశాను: ప్రియా ప్రకాష్ వారియర్

వాలెంటెన్స్ డే సందర్భంగా కన్నుగీటి సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను భవిష్యత్తులో ఎవరి సరసన నటించాలో ప్రియా ఆకాశ్ వ

వాలెంటెన్స్ డే సందర్భంగా కన్నుగీటి సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను భవిష్యత్తులో ఎవరి సరసన నటించాలో ప్రియా ఆకాశ్ వారియర్ తెలిపింది. తనకు షారూఖ్ ఖాన్‌ సరసన నటించాలని ఉన్నట్లు తెలిపింది. అలాగే విలక్షణ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో సినిమా చేయాలని వున్నట్లు ప్రియా ప్రకాష్ వారియర్ చెప్పుకొచ్చింది. 18 ఏళ్ల ప్రియా ఇంటర్వ్యూలో హిందీలో ఆకట్టుకుంది. 
 
సరళంగా హిందీ మాట్లాడి అదరగొట్టింది. కేరళలో పుట్టినా ముంబైలో పెరిగానని.. హిందీ చదువుకున్నానని ప్రియా ఆకాష్ వారియర్ వెల్లడించింది. అలాగే తాజా ఇంటర్వ్యూలో ప్రియా ఆకాష్‌ తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరో చెప్పేసింది. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంటేనే ఎక్కువ ఇష్టమని ఈ వాలు కనుల వయ్యారి భామ తెలిపింది. 
 
ఇక ''ఒరు ఆదార్ లవ్''లో కన్నుగీటే సన్నివేశం గురించి ప్రియా మాట్లాడుతూ.. కన్ను మీటే ముందు కనుబొమ్మలను పైకెత్తడం దర్శకుడు అడగటంతో అప్పటికప్పుడు చేశానని చెప్పింది. అది ముందుగా ప్లాన్ చేసుకుని షూటింగ్ చేసింది కాదని ప్రియా క్లారిటీ ఇచ్చింది. ఇకపోతే.. ప్రియా వారియర్ నటిస్తున్న ఒరు ఆదార్ లవ్ సినిమా మార్చి మూడో తేదీన విడుదల కానుంది.