గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 16 అక్టోబరు 2021 (18:36 IST)

థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో ఆది సాయికుమార్ నూత‌న చిత్రం

Aaadi sai kumar, Rammohan
ఆది సాయికుమార్ హీరోగా చాగంటి ప్రొడ‌క్ష‌న్ లో నూత‌న చిత్ర ప్రారంభోత్స‌వం రామానాయుడు స్టూడియోస్ లో వైభ‌వంగా జ‌రిగింది. శివ‌శంక‌ర్ దేవ్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్న ఈ మూవీని అజ‌య్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. క్రైమ్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొంద‌బోతున్న ఈమూవీ ఆది సాయికుమార్ కెరియ‌ర్ లో ప్ర‌త్యేకంగా నిలుస్తుంద‌ని అంటుంది చిత్ర యూనిట్.
 
ప్ర‌ముఖ నిర్మాత పుస్క‌ర రామ్మోహాన రావు గారు హీరో ఆది సాయికుమార్ పై క్లాప్ ఇవ్వ‌గా , ప్ర‌ముఖ
నిర్మాత కె.యస్ రామారావు  కెమెరా స్విచ్ఛాన్ చేసారు. ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, లగడపాటి శ్రీధర్ ,  ఈ ప్రారంభోత్సవానికి హాజరై చిత్ర యూనిట్కి అభినందనలు తెలిపారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.
 
నిర్మాత అజ‌య్ శ్రీనివాస్ మాట్లాడుతూ, మా నాన్న గారు శాంత‌య్య గ‌త 32 సంవ‌త్స‌రాలుగా డిస్ట్రి బ్యూష‌న్ రంగంలో ఉన్నారు. కారంచేడు మా స్వ‌గ్రామం. రామానాయుడుగారి ఇన్సిపిరేష‌న్ తో
ఇండ‌స్ట్రీ కి వ‌చ్చిన మా నాన్న‌గారు నేను  నిర్మాత‌గా మార‌డానికి ప్రోత్సాహం అందించారు. మంచి క‌థ‌ను రెడీ చేసుకుంటే ప్రొడ్యూస‌ర్ గా అవ‌కాశం ఇస్తాన‌న్నారు. దేవ్ చెప్పిన క‌థ నాకు బాగా న‌చ్చ‌డంతో ఆ క‌థ పై ఒక సంవ‌త్స‌ర కాలంగా ప‌నిచేసాము. ఆది సాయికుమార్ గారు కెరియ‌ర్ లో ఈ క‌థ చాలా ప్ర‌త్యేకంగా నిలుస్తుంది. ద‌ర్శ‌కుడు దేవ్ చాలా టాలెంటెడ్. న‌వంబ‌ర్ రెండో వారంలో షూటింగ్  మొద‌ల‌వుతుంద‌ని అన్నారు.
 
ద‌ర్శ‌కుడు శివ‌శంక‌ర్ దేవ్ మాట్లాడుతూ, ఇది ఒక క్రైమ్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్. ఆది సాయికుమార్ గారి పాత్ర చాలా ఢిఫ‌రెంట్ గా ఉంటుంది.  ఒక కొత్త ఆదిసాయికుమార్ గారిని ఈసినిమా తో చూస్తారు. నాకు అవ‌కాశం ఇచ్చిన ఆది సాయికుమార్ గారికి నిర్మాతకి కృత‌జ్ఞ‌త‌లు. ఒక కొత్త పాయింట్ తో సినిమా రూపొంద‌బోతుంది. ద‌ర్శ‌కుడిగా  నా ప్ర‌య‌త్నం మిమ్మ‌ల్ని అంద‌రినీ ఆనంద ప‌రుస్తుంద‌ని న‌మ్ముతున్నానని తెలిపారు.
 
ఆది సాయికుమార్ మాట్లాడుతూ,  నా కెరియ‌ర్ లో ఈ పాత్ర చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంది. క‌థ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. ద‌ర్శ‌కుడు చాలా డిటైల్డ్ గా ఈ సినిమా పై ప‌నిచేసాడు. శాంత‌య్య గారితో నాకు చాలా సంవ‌త్స‌రాలుగా స్నేహం ఉంది. ఆయ‌న కుమారుడు నిర్మాత‌గా నా సినిమా తో ప‌రిచ‌యం అవ‌డం చాలా ఆనందం గా ఉంది. దర్శకుడు దేవ్ తో నాకు రెండు సంవత్సరాలుగా తెలుసు. అందరం కథను నమ్మి ముందుకు వెళుతున్నాం. హీరోయిన్ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం.. ద‌స‌రా రోజున నా సినిమా ప్రారంభం కావ‌డం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు.
 
ఆలి రాజా మాట్లాడుతూ,  ఇందులో ఒక పోలీస్ పాత్ర‌ను చేస్తున్నాను. నా కెరియ‌ర్ లో ఇది ఒక మంచిపాత్ర‌గా మిగులుతుంద‌ని న‌మ్ముతున్నానని పేర్కొన్నారు.
తార‌క్ పొన్న‌ప్ప మాట్లాడుతూ,  ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్ట‌ర్ చేస్తున్నాను. నా క్యారెక్ట‌ర్ లో చాలా వేరియేష‌న్స్ ఉంటాయి. క‌న్న‌డ‌లో కెజియ‌ఫ్, యువ‌ర‌త్న సినిమాల‌తో మంచి గుర్తింపు వ‌చ్చింది.   ఈ పాత్ర తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత దగ్గ‌ర చేస్తుంద‌ని న‌మ్ముతున్నాప‌ని తెలిపారు.