బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 జనవరి 2018 (09:46 IST)

'అజ్ఞాతవాసి' ఫస్ట్ డే కలెక్షన్లు... ఓవర్సీస్‌లో హాలీవుడ్ రికార్డులు బద్ధలు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో తెరకెక్కి ఈనెల 10వ తేదీన రిలీజ్ అయిన చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం తొలి ఆట ప్రదర్శించకుండానే రికార్డులు సృష్టిస్తోంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో తెరకెక్కి ఈనెల 10వ తేదీన రిలీజ్ అయిన చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం తొలి ఆట ప్రదర్శించకుండానే రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా, హాలీవుడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు వసూలైన కలెక్షన్లను పరిశీలిస్తే, 
 
నైజామ్‌లో రూ.5.45 కోట్లు, సీడెడ్‌లో రూ.3.35 కోట్లు, నెల్లూరులో రూ.1.64 కోట్లు, గుంటూరులో రూ.3.78 కోట్లు, కృష్ణాలో రూ.1.83 కోట్లు, రూ.వెస్ట్‌లో రూ.3.70 కోట్లు, ఈస్ట్ రూ.2.85 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.4.30 కోట్లు  ఇలా ఈ సినిమా తొలిరోజున 26.93 కోట్లను రాబట్టింది. 
 
చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమా తొలి రోజున 23.30 కోట్లను వసూలు చేసి, 'బాహుబలి 2' తర్వాత స్థానంలో నిలబడింది. తాజాగా ఈ రికార్డును 'అజ్ఞాతవాసి' అధిగమించడం విశేషం. మరోవైపు, శుక్రవారం హీరో బాలయ్య నటించిన 'జైసింహా' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టాక్ 'అజ్ఞాతవాసి' వసూళ్లపై ఎంతవరకూ ప్రభావం చూపుతుందో వేచిచూడాల్సిందే. 
 
మరోవైపు, అజ్ఞాతవాసి కలెక్షన్లపై బాలీవుడ్ చిత్ర విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అమెరికాలో హాలీవుడ్ దిగ్గ‌జాల‌తో పోటీప‌డి టాప్ ప్లేస్ ద‌క్కించుకోవ‌డంపై ఆయ‌న ట్వీట్ చేశారు. వారం మ‌ధ్య‌లో విడుద‌లైనా తొలిరోజు ఏకంగా 1.5 మిలియ‌న్ డాల‌ర్లు సాధించ‌డాన్ని అద్భుతం అంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ ప్ర‌భంజ‌నాన్ని తుఫాన్ అనాలో, సునామీ అనాలో తెలియ‌డం లేద‌న్నారు. 
 
అమెరికాలో 'అజ్ఞాత‌వాసి' ప్ర‌స్థానం అద్భుతంగా మొద‌లైందన్నారు. కేవ‌లం ప్రీమియ‌ర్ల ద్వారానే 9.65 కోట్లు కొల్ల‌గొట్టింది. వీకెండ్‌లో కాకుండా వ‌ర్కింగ్ డే రోజు ఈ స్థాయి క‌లెక్ష‌న్లు సాధించ‌డం అత్య‌ద్భుతం. దీన్ని తుఫాను అనాలా, సునామీ అనాలా, టైఫూన్ అనాలా? హాలీవుడ్ దిగ్గ‌జాల‌తో పోటీప‌డి 'అజ్ఞాత‌వాసి' యూఎస్ బాక్సాఫీస్ వ‌ద్ద టాప్ ప్లేస్ ద‌క్కించుకుందని త‌ర‌ణ్ ట్వీట్ చేశారు.