మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 జనవరి 2018 (09:36 IST)

'అజ్ఞాతవాసి' కలెక్షన్ల సునామీ.. ఎన్టీఆర్ అభిమానుల్లో టెన్షన్.. ఎందుకు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం ఈనెల 10వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం ఈనెల 10వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తోంది. అయితే, ఈ సినిమా టాక్ మాత్రం మిశ్రమంగా ఉంది. కానీ, ఈ టాక్‌తో సంబంధం లేకుండా చిత్రం వసూళ్లను రాబడుతోంది. 
 
అయితే, ఈ చిత్రానికి వచ్చిన టాక్ ఇపుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. సోషల్ మీడియా వేదికగా వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం.. ఎన్టీఆర్ తర్వాతి సినిమాను త్రివిక్రమ్‌తోనే చేయనున్నాడు. దీంతో ఆయన అభిమానుల్లో గుబులు మొదలైంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న సినిమా ఇప్పటికే ప్రారంభ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇదే వారి ఆందోళనకు ప్రధాన కారణంగా ఉంది. 
 
ఇదిలావుంటే, ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా త్రివిక్రమ్‌కు ఓ విన్నపం చేస్తున్నారు. అదేంటంటే... ‘మా హీరో సినిమానైనా మనసు పెట్టి చెయ్ మాంత్రికుడా’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఎన్టీఆర్ సినిమాకు హిట్ ఇస్తేనే ఆయన అగ్రదర్శకుల లిస్టులో ఉంటాడని, లేదంటే కష్టమేనని చెబుతున్నారు.