మంగళవారం, 18 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2017 (18:47 IST)

#AgnyaathavaasiTeaser దట్స్ ద బ్యూటీ.. స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా (వీడియో)

అత్తారింటికి దారేది సినిమాకు తర్వాత త్రివిక్రమ్‌‍తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ''అజ్ఞాత వాసి" ట్రైలర్ శనివారం విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ అత్తారింటికి దారేది సినిమా ఛాయలు లైట్‌గా కనిపిస్తున్నాయ

అత్తారింటికి దారేది సినిమాకు తర్వాత త్రివిక్రమ్‌‍తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ''అజ్ఞాత వాసి" ట్రైలర్ శనివారం విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ అత్తారింటికి దారేది సినిమా ఛాయలు లైట్‌గా కనిపిస్తున్నాయని టాక్ వస్తోంది. అత్తారింటికి దారేది చిత్రంలో రామ రామం భజే పాటలో చెప్పులేసుకోకుండా వట్టి కాళ్లతో నడిచే పవర్ స్టార్.. ఈ చిత్రం ట్రైలర్లో బూటులేసుకుని ఫైట్ చేశాడు. ఈ ట్రైలర్‌లో మధురాపురి సదన మృదువదన మధుసూదన.. స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా.. అంటూ సాగే పాటతో పవన్ ఎంట్రీ ఇచ్చాడు. 
 
ఇక భరత నాట్యం సీక్వెన్స్ కూడా ఇందులో వున్నాయి. ఇక అను ఇమ్మాన్యుయేల్‌తో రొమాంటిక్ సీన్స్ అదిరిపోయాయి. ఇక మరో హీరోయిన్ కీర్తీ సురేష్ పవన్ బుగ్గ గిచ్చుతూ చేసిన సీన్ బాగుంది. టెక్కీగా ఈ సినిమా పవర్ లుక్స్ బాగున్నాయి. ఈ ట్రైలర్‌లో పవర్ స్టార్ కొత్తగా కనిపిస్తున్నారు. ఇంకేముంది.. పవర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకునే అజ్ఞాత వాసి ట్రైలర్ మీ కోసం..