శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2017 (09:17 IST)

పవన్‌కు గుండు కొట్టించిన మాట నిజమే : ఆర్కే.రోజా

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌కు అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేత దివంగత పరిటాల రవి జీవించివున్న సమయంలో గుండు కొట్టించారన్న ప్రచారం ఉంది.

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌కు అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేత దివంగత పరిటాల రవి జీవించివున్న సమయంలో గుండు కొట్టించారన్న ప్రచారం ఉంది. దీనిపై ఇటీవలే పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత పరిటాల రవి భార్య, ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత కూడా వివరణ ఇచ్చారు. దీంతో ఈ అంశానికి ఇంతటితో ఫుల్‌స్టాఫ్ పడుతుందని అందరూ భావించారు.
 
కానీ, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌కు గుండు కొట్టించిన మాట నిజమేనని స్పష్టం చేశారు. అయితే, పవన్‌కు గుండు కొట్టించింది పరిటాల రవి కాదనీ, టీడీపీ అని చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై రోజా స్పందిస్తూ, "గుండుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ టీడీపీ గుండు కొట్టించిన మాట వాస్తవమేనని అన్నారు. 
 
ఆ సమయంలో నేను టీడీపీలోనే ఉన్నాను. కానీ నాది ఎటువంటి పాత్రలేదు. అసలు గుండు వ్యవహారమనేది పవన్ చెప్పిన తేదీలు చూస్తేనే అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ ఆ రోజు పవన్‌కు గుండుకొట్టిందన్న మాట నిజం. 2014లో మొన్న మళ్లీ గుండు కొట్టించింది నిజం. 2019లో మళ్లీ పవన్‌కు టీడీపీ గుండు కొట్టించబోతోంది ఇది పవన్ తెలుసుకుని జాగ్రత్త పడితే బాగుంటుంది" అని రోజా హితవు పలికారు.