సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 18 డిశెంబరు 2020 (17:25 IST)

అజ‌య్‌దేవ‌గ‌ణ్ “గ్రీన్ ఇండియా .. గురించి ఏమ‌న్నాడు!

ఇప్పటిదాక ఒకరికొకరితో నిర్విఘ్నంగా ముందుకు సాగిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”.. ఇప్పుడు సంస్థల్ని కదిలిస్తుంది. చినుకు చినుకు గాలివానగా మారినట్టు, చిన్న చిన్న నీటిపాయలన్ని కలిసి నదిలా మారినట్టు..“గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఒక కొత్త ప్రస్థానంలోకి అడుగుపెడుతుంది. పల్లె నుంచి ఢిల్లీదాక అందర్ని ఒక్కటి చేస్తుంది. ప్రకృతిని ప్రేమించే హృదయాలను పలుగు పార పట్టి మొక్కలు నాటమని పిలుపునిస్తున్నది.
 
“స్పూర్తిని మించిన తృప్తి లేదు” అన్న నానుడిని నిజం చేస్తూ అనేకమంది సెలెబ్రెటీలు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో పాల్గొని ప్రజల్లో పర్యావరణం పట్ల చైతన్యం నింపుతున్నారు. ఈ కార్యక్రమ కొనసాగింపులో భాగంగా బాలీవుడ్ సుప్రీం హీరో అజయ్ దేవ్‌గణ్ రామోజీ ఫిల్మ్ సిటీలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం పరితపించే తాను “NY” ఫౌండేషన్ స్థాపించాను. 
 
అయితే, కానీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” దేశవ్యాప్తంగా విస్తృతంగా ముందుకు సాగుతుంది. ఇక నుంచి నా  “NY” ఫౌండేషన్ కార్యక్రమాల్లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” భాగస్వామ్యం చేస్తాం. మేం నిర్వహించే ప్రతీ కార్యక్రమంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను ప్రజల్లోకి తీసుకెళ్తాం. 
 
“గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నా మనసుకు చాలా దగ్గరైన కార్యక్రమం. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళుతూ.. కోట్లాది మొక్కలు నాటించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కి నా శుభాకాంక్షలు. వారు ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు అజయ్ దేవ్‌గణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలు మున్నంగి, కరుణాకర రెడ్డి, సంజీవ రాఘవ తదితరులు పాల్గొన్నారు.