సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 28 అక్టోబరు 2020 (17:42 IST)

గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ నుంచి అత్యధిక దిగుబడులు అందించే ఆయిల్‌ పామ్‌ మొక్కలు విడుదల.. విశాఖలో...

గోద్రేజ్‌ అగ్రోవెట్‌ యొక్క ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ వ్యాపారం నేడు నూతన, అత్యధిక దిగుబడిని అందించే ఆయిల్‌పామ్‌ మొక్కలను విడుదల చేసింది. మలేషియా నుంచి సేకరించిన సేమీ క్లోనల్‌ విత్తనాల ద్వారా వీటిని అభివృద్ధి చేశారు. ఈ మొక్కలను ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ ఫ్యాక్టరీ జోన్‌ కింద ఉన్న రైతులకు పంపిణీ చేశారు.
 
ఈ సందర్భంగా శ్రీ నసీమ్‌ అలీ, సీఈవో, ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌, గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ మాట్లాడుతూ, ‘‘పర్యావరణ ఒత్తిడి కారణంగా సృష్టించబడే వ్యవసాయ సమస్యలు నేరుగా రైతుల ఆదాయంపై ప్రభావం చూపుతాయి. గత మూడు దశాబ్దాలుగా భారతీయ రైతులకు సేవలనందించడంలో ముందున్న గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ స్ధిరంగా వినూత్నమైన పరిష్కారాలను అందిస్తూనే ఉంది. ఈ నూతన వెరైటీ ఆయిల్‌ పామ్‌ కింద ఈ అక్టోబర్‌- నవంబర్‌ 2020లో ఆంధ్రప్రదేశ్‌లో 160 నుంచి 170 హెక్టార్లలో సాగును చేయగలమని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.
 
శ్రీ చిరంజీవ్‌ చౌదరి, ఐఎఫ్‌ఎస్‌, కమిషనర్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాట్లాడుతూ, ‘‘ఆయిల్‌ పామ్‌లో అత్యధిక దిగుబడి అందించే సెమీ క్లోనల్‌ విత్తన మొక్కలను విడుదల చేసిన గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ను అభినందిస్తున్నాను. ఆయిల్‌పామ్‌ ఉత్పత్తి పరంగా అగ్రస్ధానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రైతులకు ఇది ఉపయుక్తంగా ఉండటంతో పాటుగా భారతదేశ వ్యాప్తంగా రైతులకు సైతం ప్రయోజనకారిగా ఉండనుంది’’ అని అన్నారు.
 
డాక్టర్‌ ఆర్‌ కె మాథుర్‌, డైరక్టర్‌, ఐసీఏఆర్‌- ఐఐఓపీఆర్‌ (ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ పామ్‌ రీసెర్చ్‌), ఏపీ మాట్లాడుతూ ‘‘ఇతర నూనె మొక్కలతో పోలిస్తే ఆయిల్‌ పామ్‌ సాగు ద్వారా వచ్చే రాబడులు అధికంగా ఉంటాయి. గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ విడుదల చేసిన ఈ మొక్కలతో రైతుల ఆదాయం వృద్ధి చెందడంతో పాటుగా వంటనూనెల విభాగంలో స్వీయ సమృద్ధికి సైతం తోడ్పడవచ్చు’’ అని అన్నారు.
 
ఈ నూతన రకపు, అత్యధిక దిగుబడి అందించే ఆయిల్‌ పామ్‌ మొక్కలు భారతదేశ వ్యాప్తంగా ఆయిల్‌ పామ్‌ రైతులు, పెంపకందారులకు లభ్యమవుతాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, తమిళనాడు, ఒడిషా, గుజరాత్‌, మిజోరం, గోవాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు.