ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ యొక్క బెస్ట్ ప్రైస్ క్యాష్ ఆండ్ క్యారీ బిజినెస్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలో కొత్త హోల్ సేల్ స్టోర్‌ను అట్టహాసంగా ప్రారంభించింది. తమ సభ్యుల్లోని కిరాణాదారులు, చిన్నతరహా వ్యాపారవేత్తలకు మరింత మెరుగైన సేవలకు అందించడం, విస్తృతమైన శ్రేణిలో సేవలు, మెరుగైన ధరలో ఉత్పత్తులు చేరువ చేయడం, డోర్ స్టెప్ డెలివరీ, సులభమైన చెల్లింపు విధానాలు అందించడం సాధ్యం అవుతుంది.
తిరుపతిలో ప్రారంభించిన ఈ బెస్ట్ ప్రైస్ స్టోర్ భారతదేశంలో 29వది. మెంబర్‌షిప్ మోడల్ ద్వారా తొమ్మిది రాష్ట్రాల్లో కిరాణాదారులు, ఆఫీసులు & ఇన్‌స్టిట్యూషన్లు, హోటల్లు, రెస్టారెంట్లు మరియు కేటరర్లు (HORECA)కు సేవలు అందిస్తోంది.
ఈ నూతన స్టోర్ ద్వారా తిరుపతిలోని చిన్న వ్యాపారవేత్తల వ్యాపార అవసరాలను తీర్చడం సాధ్యమవుతుంది మరియు `ప్రతి రోజూ తక్కువ ధరలు (Every Day Low Prices) నినాదంతో వినియోగదారులకు సులభం అవుతుంది.
బెస్ట్ ప్రైస్ సభ్యులు కొనుగోలుకు సంబంధించి అనేక వెసులుబాటు కల్పించింది. స్టోర్‌లోకి నేరుగా విచ్చేసి కొనుగోలు చేయడం, బెస్ట్ ప్రైస్ హోల్ సేల్ యాప్, బెస్ట్ ప్రైస్ వెబ్ సైబ్, 180030101911 కస్టమర్ కేర్ నంబరుకు ఫోన్ చేయడం ద్వారా షాపింగ్ చేయవచ్చు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ స్టోర్‌ను ప్రారంభించిన సందర్బంగా మాట్లాడుతూ, ``ఈజ్ ఆఫ్ డూయిగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్ర స్థానంలో ఉంది. ప్లిఫ్‌కార్ట్ గ్రూప్‌తో దీర్ఘకాలిక సంబంధాలు కలిగి ఉన్న ఏపీ ఆరో స్టోర్‌ను రాష్ట్రంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఈ కొత్త స్టోర్ వల్ల తిరుపతిలో కొత్త ఉద్యోగాలు మరియు నూతన అవకాశాలు పొందడం సాధ్యమవుతుంది. ప్లిఫ్‌కార్ట్ గ్రూప్ మరోమారు పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంచుకున్నందుకు మేం సంతోషిస్తున్నాం. రాబోయే కాలంలో ఇటు సంస్థ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరస్పరం ప్రయోజనాలు పొందాలని ఆకాంక్షిస్తున్నాం`` అని పేర్కొన్నారు.
ప్లిఫ్‌కార్ట్ హోల్‌సేల్ & వాల్‌మార్ట్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు హెడ్ శ్రీ ఆదర్శ్ మీనన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, `` భారతదేశవ్యాప్తంగా స్టోర్లు మరియు ఈ కామర్స్ విధానంలో పటిష్టమైన ప్రక్రియతో కిరాణాదారులు, రీసెల్లర్లు మరియు చిన్న తరహా వ్యాపారవేత్తల ఆకాంక్షలు నెరవేర్చేలా సేవలు అందించాలనే మా లక్ష్యానికి తిరుపతిలో నూతన స్టోర్‌ను ప్రారంభించడం ఒక ఉదాహరణ. కిరాణాదాఉలు మరియు చిన్న, మధ్యతరహా వ్యాపారవేత్తలు మా ముఖ్య భాగస్వామ్యులు. కరోనా సమయంలో పలు సవాళ్లు ఎదురైనప్పటికీ వారు వృద్ధి చెందేందుకు మరియు లాభాలు సాధించేందుకు మేం కట్టుబడి ఉన్నాం.
ప్రస్తుతం మేం ఆంధ్రప్రదేశ్‌లో ఆరో స్టోర్ ప్రారంభించాం. రాజమండ్రి, గుంటూర్, కర్నూల్, విజయవాడ మరియు విశాఖపట్టణంలో మా మిగతా ఐదు స్టోర్లు ఉన్నాయి. రాష్ట్రంలోని స్థానిక యువతకు వేలాది ఉద్యోగాలు కల్పించినందుకు మరియు స్థానిక చిన్న, మధ్యతరహా వ్యాపార విభాగాలను వృద్ధి చెందేందుకు క్రమానుగతంగా కృషిచేస్తున్నందుకు మేం గర్విస్తున్నాం. స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల సప్లై చైన్‌ను మరింత బలోపేతం చేయడం, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కృషి, కిరాణాదారులు వృద్ధి పథంలో సాగేందుకు మేం కృషి చేయడం, తద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ముందుకు సాగడం మాకెంతో సంతోషాన్ని ఇస్తోంది`` అని పేర్కొన్నారు.
బెస్ట్ ప్రైస్ క్యాష్ ఆండ్ క్యారీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న వాల్ మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను ఈ ఏడాది జూలైలో ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ విలీనం చేసుకుంది. సంస్థ యొక్క పటిష్టమైన హోల్ సేల్ వ్యవస్థ, కిరాణాదారులు మరియు ఎంఎస్ఎంఈలకు మరింత మెరుగ్గా సేవలు అందించంఏదుకు ఈ నిర్ణయం తీసుకుంది.
తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న ఈ కొత్త బెస్ట్ ప్రైస్ స్టోర్ కీలక మైలురాయిగా నిలవడమే కాకుండా దేశంలో ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ యొక్క బీ2బీ వ్యాపార విధానం అమలు చేసే విధానాలను స్పష్టం చేయనుంది.
56,000 చదరపు అడుగుల స్థలంలో విస్తరించి ఉన్న ఈ స్టోర్ ద్వారా 2000 ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలు స్థానికులకు దక్కనున్నాయి మరియు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు స్పష్టమైన ప్రయోజనం దక్కుతుంది.
బెస్ట్ ప్రైస్ తిరుపతి స్టోర్ ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో నిర్వహించబడనుంది. వాటర్ హార్వెస్టింగ్, వేస్ట్ మేనేజ్‌మెంట్, పునరుజ్జీవ ఇంధనాల వినియోగం వంటి చర్యలు తీసుకోనున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకపోవడం అనే సంస్థ యొక్క ఖచ్చితమైన నిర్ణయం, నైలాన్ బెల్టుల వినియోగం, బయోడీగ్రేడబుల్ బ్యాగులు మరియు ఇతర పర్యావరణ హితమైన ఉత్పత్తులను ఈ స్టోర్‌లో వినియోగిస్తున్నారు.