శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2016 (14:23 IST)

అభిమానికి అక్షయ్ బాడీగార్డ్ పిడిగుద్దులు.. ట్విట్టర్‌లో క్షమాపణలు

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌ ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించడంతో సెల్ఫీ దిగాలనుకున్న అతడి అభిమానికి చేదు అనుభవం ఎదురైంది. ముంబై ఎయిర్‌పోర్ట్ వద్ద అక్షయ్‌తో సెల్ఫీ తీసుకుంటుండగా అభిమానిని అక్షయ్ బాడీగార్డ్ గట్టి పంచ్ ఇచ్చి గాయపరిచాడు. దీంతో ఆ అభిమాని తేరుకోలేకపోయాడు. ఈ ఘటనంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో అక్షయ్ కుమార్ తన బాడీగార్డ్‌ను హెచ్చరించాడు. 
 
మరోసారి ఇలాంటి ఘటన జరిగితే ఉద్యోగంలో నుంచి తీసేస్తానని గట్టిగా హెచ్చరించాడు. అయితే ఈ ఘటనపై అక్షయ్ స్పందించారు. ఆ అభిమానికి ట్విట్టర్ ద్వారా క్షమాపణలు తెలియజేశారు. ''అది అనుకోకుండా జరిగిన సంఘటన అని, తన బాడీగార్డు అభిమానిపై చేయి చేసుకోవడం తప్పని తాను గమనించలేదన్నారు. అందుకే అక్కడి నుంచి వెళ్లిపోయానని'' తెలిపారు. జరిగిన విషయం తెలిసిన తర్వాత చాలా బాధపడ్డానని, తన బాడీగార్డును సైతం హెచ్చరించినట్లు అక్షయ్ వెల్లడించారు. అందుకే క్షమాపణలు చెబుతున్నానని, ఇకమీదట ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు హామీ ఇస్తుస్తానని పేర్కొన్నారు.