మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: సోమవారం, 20 మే 2019 (21:38 IST)

మహేష బాబును ఆ మాటని చాలా బాధపడ్డా: అల్లరి నరేష్

మహర్షి సినిమా ఏ స్థాయి బ్లాక్ బస్టర్ అయ్యిందో పెద్దగా చెప్పినవసరం లేదు. భారీ కలెక్షన్లతో సినిమా దూసుకుపోతోంది. ఇప్పటికీ థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు దర్సమమిస్తున్నాయి. ఈ సినిమాలో నటించిన మహేష్ బాబుకు ఎంత పేరొచ్చిందో అతని స్నేహితుడిగా నటించిన అల్లరి నరేష్‌కు అంతే పేరొచ్చింది.
 
అయితే ఈమధ్య సినిమా మీద, మహేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అల్లరి నరేష్. సినిమాలో మహేష్ బాబును ఒరేయ్ అని పిలిచేటప్పుడు చాలా బాధపడ్డా. ఇదే విషయాన్ని డైరెక్టర్‌కు చెప్పా. అయితే కథను బట్టి ఇదంతా నడుస్తుంది. బాధపడకు అన్నాడు. నాకైతే రెండు రోజుల పాటు నిద్ర కూడా పట్టలేదు అంటున్నాడు అల్లరి నరేష్. ప్రిన్స్ మహేష్ ఈ విషయాన్ని లైట్ తీసుకున్నాడట.