కేరళ పోలీసులకు నచ్చిన అల్లు అర్జున్
మలయాళంలో అల్లు అర్జున్ సినిమాలంటే క్రేజ్. అక్కడ ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినా కేరళలో తండోపతండాలుగా యూత్ వస్తుంటారు. ఈ క్రేజ్‌ను వాడుకోవడానికి కేరళ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. వారు `పోల్ యాప్` అనే పోలీసు యాప్‌ను వినియోగిస్తున్నారు. అందుకు యూత్‌లో బాగా వెళ్ళాలంటే అల్లు అర్జున్‌ను వినియోగించుకున్నారు. ఎలాగంటే, రేసుగుర్రంలో తన కుటుంబానికి ఆపద వచ్చినప్పుడు షడెన్‌గా పోలీసు బైక్‌పై ప్రత్యక్షమవుతాడు అల్లు అర్జున్. సేమ్‌టు సేమ్ అలాగే ఓ వీడియోను తయారుచేసింది.
కేరళ పోలీసు. ఆ వీడియో ఎలా వుందంటే, ఆ వీడియోలో హీరో కుటుంబం ఓ వాహనంలో చిక్కుకుపోతుంది. దాన్నుంచి బయటకు రావడానికి శతవిధాల ప్రయత్నిస్తుంటుంది. ఆ వాహనాన్ని ఢీ కొట్టడానికి విలన్‌లు మరో వాహనంలో వస్తుంటారు. అదే సమయంలో పోల్ యాప్‌ను ప్రెస్ చేయగా.. పోలీస్ డ్రెస్‌లో ఉన్న అల్లు అర్జున్ వారికి ఎదురుగా వస్తారు. ఒక్కసారిగా విలన్‌లు హడలిపోయి సడన్ బ్రేక్ వేస్తారు. అలా తన కుటుంబాన్ని హీరో రక్షించుకుంటారు. పోల్ యాప్ కిందకు అన్ని శాఖలను అందుబాటులోకి తీసుకు వచ్చామని కేరళ పోలీసులు తెలియ జేస్తున్నారు. ప్రమాద సమయంలో ఈ యాప్‌ను వినియోగిస్తే, తాము క్షణాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుంటామని చెప్పడానికి కేరళ పోలీసులు ఈ వీడియోను రూపొందించారు. ఇది చూసి మన పోలీసులు కూడా ఏదైనా యాప్ తయారుచేస్తారేమో చూడాలి.