అమలాపాల్-విజయ్‌లకు విడాకులు.. ఇక ఎవరిదారి వారిదే..!
సినీ నటి అమలాపాల్‌కు విడాకులు వచ్చేశాయ్. భర్తతో విబేధాల కారణంగా కెరీర్‌పై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఆతని నుంచి అమలా పాల్ దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమలాపాల్, ఆమె భర్త విజయ్‌లకు చెన్నై ఫ్యామ
సినీ నటి అమలాపాల్‌కు విడాకులు వచ్చేశాయ్. భర్తతో విబేధాల కారణంగా కెరీర్‌పై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఆతని నుంచి అమలా పాల్ దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమలాపాల్, ఆమె భర్త విజయ్‌లకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. గత ఆరునెలల పాటు జ్యూడీషియల్ సెపరేషన్ కారణంగా విడివిడిగా ఉంటున్న వీరికి మంగళవారం విడాకులు మంజూరైనాయి. 2014 జూన్ 12న వీరిద్దరూ పెద్దల సమక్షంలో ఒకటైన సంగతి తెలిసిందే.
కానీ పెళ్లైయ్యాక సినిమాలకు దూరంగా ఉండాలనే అత్తింటివారి నిబంధనను అమలా పాల్ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వారి మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో అమలాపాల్-విజయ్ జంట విడిపోయింది. ఆపై కోర్టును కూడా ఆశ్రయించింది. ఇకపోతే.. వివాహ బంధానికి దూరమైన తర్వాత ఈ ఇద్దరూ తమ తమ కెరీర్‌లపై దృష్టి సారించారు. ఇప్పటికే అమలా పాల్ చేతిలో అరడజను ఆఫర్లుండగా, విజయ్ కూడా రెండు సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. అమలా పాల్ 2011లో విజయ్ దర్శకత్వం వహించిన దైవమగల్ సినిమాలో కీలక పాత్ర పోషించింది. అప్పటి నుంచే అమల- విజయ్‌ల మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ సైతం పెద్దల అంగీకారంతో పెళ్ళి వరకు వచ్చింది. కానీ వీరి వైవాహిక జీవితం ఏడాది పూర్తయ్యిందో లేదో అంతలోనే విడిపోయారు.