శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జనవరి 2020 (14:25 IST)

విఘ్నేశ్ శివన్‌తో బ్రేకపా.. ఛాన్సే లేదు... ఇదిగోండి.. ఫోటో

విఘ్నేశ్ శివన్‌తో నయనతార బ్రేకప్ చేసుకుందని వస్తున్న వార్తలకు చెక్ పెట్టేలా.. లేడి సూపర్ స్టార్ నయనతార కామెంట్స్ చేసింది. తన కలలను నిజం చేసుకోవడంలో విఘ్నేశ్ శివన్ సహకారం ఎంతో ఉందని చెప్పింది. విఘ్నేశ్ శివన్ ప్రేమలో తాను చాలా సంతోషంగా ఉన్నాననీ, ఆయన ప్రేమలో తాను చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నానని వెల్లడించింది. తద్వారా బ్రేకప్ వార్తలకు నయన్ బ్రేక్ పడేలా కామెంట్లు చేసింది. 
 
కాగా, లేడీ సూపర్ స్టార్ నయనతార దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ సందర్భంగా ఈ జంట విదేశాలలో కూడా విహరించి ఇటీవలే భారత్‌కు చేరుకుంది. అయితే ఈ జంట విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. 
 
కానీ ఓ అవార్డ్ ఫంక్షన్‌లో ఈ వార్తలు నిజం కాదంటూ.. నయన కామెంట్స్ చేసింది. అంతేగాకుండా విఘ్నేశ్ శివన్ నయనతారతో కలిసి దిగిన సెల్ఫీని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఈ ఫోటోలో విఘ్నేష్, నయన అదిరిపోయే ఫోజిచ్చారు. నయన బ్రౌన్ రంగు చీరలో మెరిసిపోతోంది.