గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: సోమవారం, 21 అక్టోబరు 2019 (11:35 IST)

తమన్నాపై కోపంతో ఉన్న నయనతార.. ఎందుకు?

సైరా సినిమా తెలుగు సినీపరిశ్రమలో ఎంతటి విజయం సాధించిందో పెద్దగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవితో పాటు తమన్నా, నయనతారల నటన ఈ సినిమాకే హైలెట్. ఇద్దరు హీరోయిన్లు పోటీలు పడి నటించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించింది.
 
అయితే సినిమాలో తమన్నా క్యారెక్టర్ ఎక్కువసేపు ఉండడం.. ఆమె క్యారెక్టర్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. సినిమా ప్రమోషన్స్‌కు తమన్నానే చిరుతో కలిసి తిరిగారు. దీంతో సైరా సినిమాలో అసలు హీరోయిన్ తమన్నానే.. ఆమే సినిమాకి కీరోల్ అంటూ ప్రచారం జరుగుతోంది. నయనతార క్యారెక్టర్ పెద్దగా ఏమీ లేదని ఆమె స్థానంలో ఎవరిని పెట్టినా ఆ క్యారెక్టర్ ఈజీగా చేసేస్తారని.. కానీ తమన్నా క్యారెక్టర్‌కు మాత్రం ఆమె మాత్రమే సరిగ్గా సరిపోతుందని సినిమా యూనిట్‌తో పాటు చిరంజీవి కూడా చెబుతున్నారు.
 
నిర్మాత రాంచరణ్ కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో ఇదే విషయాన్ని చెప్పారు. దీంతో ఇది కాస్త నయనతారకు బాగా కోపం తెచ్చిపెట్టించిందట. తనకు ఇచ్చిన క్యారెక్టర్‌కు తను న్యాయం చేస్తే తన గురించి ఎందుకు మాట్లాడలేదని తమన్నాపై ఆగ్రహంతో ఊగిపోతోందట నయనతార.