శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 5 నవంబరు 2016 (14:16 IST)

ఐశ్వర్యా.. పరిధి దాటి నటించడం అవసరమా? కోడలిపై బచ్చన్ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి

బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యారాయ్‌పై బచ్చన్ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తితో ఉందట. దీనికి కారణం లేకపోలేదు. తన కోడలైన ఐశ్వర్యారాయ్ పరిధి దాటి హాట్ హాట్ సన్నివేశాల్లో నటించడాన్ని బచ్చన్ ఫ్యామిలీ జీర్ణించుకోలేక

బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యారాయ్‌పై బచ్చన్ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తితో ఉందట. దీనికి కారణం లేకపోలేదు. తన కోడలైన ఐశ్వర్యారాయ్ పరిధి దాటి హాట్ హాట్ సన్నివేశాల్లో నటించడాన్ని బచ్చన్ ఫ్యామిలీ జీర్ణించుకోలేక పోతోందట. ఇదే బచ్చన్ ఫ్యామిలీలో విభేదాలను తారా స్థాయికి చేర్చినట్టు సమాచారం.
 
పాక్ నటుడు రణ్‌బీర్ కపూర్, ఐశ్వర్యారాయ్, అనుష్క ప్రధాన పాత్రల్లో నిర్మితమైన చిత్రం 'యే దిల్ హై ముష్కిల్'. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఇందులో రణ్‌బీర్ కపూర్, ఐశ్వర్యా రాయ్ శృంగార సన్నివేశాలు పరిధులు దాటిపోయాయి. ఈ సీన్లపై బాలీవుడ్‌లో పెద్ద చర్చే జరిగింది కూడా. 
 
ఇందులో తమ కోడలు హాట్ హాట్‌గా నటించడమే వారి కోపానికి కారణంగా మారింది. బచ్చన్ ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా 'యే దిల్ హై ముష్కిల్' సినిమాను వేసినా... అమితాబ్, జయా బచ్చన్‌లు వెళ్లలేదట. అంతేకాదు, అంతకు ముందు దర్శకనిర్మాత కరణ్ జొహార్ వేసిన స్పెషల్ షోను కూడా వారు చూడలేదు. మరోవైపు, ఐష్ భర్త అభిషేక్ బచ్చన్ ఇంత వరకు ఈ సినిమాను చూడక పోవడం గమనార్హం.