శనివారం, 26 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 21 నవంబరు 2016 (16:18 IST)

మకిలి పట్టిన దేశాన్ని కడిగేయాలంటారు.. నోట్ల నిషేధం వ్యతిరేకించే వారిపై అనంత శ్రీరాం వ్యంగ్య కవిత (వీడియో)

దేశంలో పెద్ద కరెన్సీ నోట్లను నిషేధిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని అనేక మంది తప్పుబడుతున్నారు. వీరిలో ఆర్థికవేత్తలు, నిపుణులు కూడా ఉన్నారు. నోట్ల నిషేధాన్ని వ్యతిరేకిస్తున్న

దేశంలో పెద్ద కరెన్సీ నోట్లను నిషేధిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని అనేక మంది తప్పుబడుతున్నారు. వీరిలో ఆర్థికవేత్తలు, నిపుణులు కూడా ఉన్నారు. నోట్ల నిషేధాన్ని వ్యతిరేకిస్తున్న వారినుద్దేశించి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన యువ రచయిత అనంత శ్రీరామ్ ఓ వ్యంగ్య కవితను రాశాడు. "భారతీయులమండి" అని టైటిల్‌తో ఈ కవిత సాగుతుంది. ఈ కవితను తానే చదువుతూ.. ఉన్న వీడియోను తన ఫేస్‌బుక్‌ పేజీలో ఆయన పెట్టాడు. ప్రస్తుతం ఈ కవిత సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
ఈ కవితలో "ఎవడో వచ్చి ఏదో చేస్తాడని ఎదురు చూస్తుంటాం.. నిజంగానే ఎవడైనా ఏదైనా చేస్తుంటే మాత్రం ఎద్దేవా చేస్తాం... భారతీయులమండి.. మేం భారతీయులం" అని వ్యంగ్యంగా విమర్శించాడు. 'మకిలి పట్టిన దేశాన్ని కడిగేయాలంటాం.. మా కడుపులో నీళ్లు మాత్రం కదలకూడదంటాం' అంటూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారిని దుయ్యబట్టాడు. ఆయనేమన్నారో మీరూ వినండి.