క్యాస్టింగ్ కౌచ్ గురించి యాంకర్ రష్మి ఏమందంటే?
మీటూ, క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మీటూ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే.. క్యాస్టింగ్ కౌచ్ దేశంలోని పలు భాషలకు చెందిన సినిమా ఇండస్ట్రీలను షేక్ చేసింది. తాజాగా బుల్లితెరపై క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై బుల్లితెర యాంకర్ రష్మి నోరు విప్పింది.
టీవీ షోలతో పాటు సినిమాలతో కూడా చాలా బిజీగా ఉంటోంది రష్మి. సోషల్ మీడియాలో కూడా రష్మి చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా సినీ పరిశ్రమలోని క్యాస్టింగ్ కౌచ్ సంస్కృతిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలన్నా కమిట్‌మెంట్ తప్పనిసరి అంటూ చాలా మంది నటీమణులు చెప్పిన సంగతి తెలిసిందే.
దీనిపై రష్మి స్పందిస్తూ... చాలా మందికి ఇలా చెప్పడం చాలా సులభం అని వ్యాఖ్యానించింది. ఇలా చెప్పడం ఈజీనే కానీ ఆ స్థాయికి చేరుకున్న వారికి మాత్రమే బాధ తెలుస్తుందని చెప్పింది. టాప్ పొజిషన్ కు చేరుకోవడానికి వారు ఎంత కష్టపడతారో అనే విధంగా ఆమె స్పందించింది.