ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By tj
Last Updated : బుధవారం, 10 జనవరి 2018 (21:34 IST)

ఆ విషయంలో అడ్డంగా బుక్కయిన బుల్లితెర యాంకర్

బుల్లితెర యాంకర్లలో ప్రదీప్ తర్వాత ఒక్కొక్కరి వ్యవహారం బయటపడుతోంది. తప్పతాగి వాహనాన్ని నడిపి ట్రాఫిక్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన యాంకర్ ప్రదీప్ ఆ తర్వాత కౌన్సిలింగ్‌కు వెళ్ళి పోలీసులకు, ప్రజలకు క్ష

బుల్లితెర యాంకర్లలో ప్రదీప్ తర్వాత ఒక్కొక్కరి వ్యవహారం బయటపడుతోంది. తప్పతాగి వాహనాన్ని నడిపి ట్రాఫిక్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన యాంకర్ ప్రదీప్ ఆ తర్వాత కౌన్సిలింగ్‌కు వెళ్ళి పోలీసులకు, ప్రజలకు క్షమాపణ చెప్పాడు. 
 
అయితే తాజాగా యాంకర్ రవి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ఒక నటుడికి సపోర్టు చేసి చివరకు బుక్కయ్యాడు. గతంలో నాగచైతన్య నటించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ఆడియో ఫంక్షన్‌లో మహిళలు పడుకోవడానికే అని తీవ్రస్థాయిలో నటుడు చలపతిరావు వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలను యాంకర్ రవి సమర్థించాడు. 
 
దీంతో మహిళా సంఘాలు మండిపడ్డాయి. చలపతిరావుతో పాటు యాంకర్ రవిపై పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు మహిళా సంఘాల నేతలు. దీంతో రవి హైదరాబాద్‌లోని కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుతం కోర్టులో వ్యవహారం నడుస్తుంది కాబట్టి దీనిపైన నేనేమీ మాట్లాడనంటూ రవి వెళ్ళిపోయాడు.