మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (18:11 IST)

ప్ర‌భాస్ బేన‌ర్‌లో అనుష్క సినిమా!

Anuksha Setty, New movie
అనుష్క‌, ప్ర‌భాస్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `బాహుబ‌లి` ఎంత‌టి క్రేజ్ తీసుకువ‌చ్చిందో అంద‌రికీ తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా పేరు తెచ్చుకుని విదేశాల్లో కూడా క‌లెక్ల‌న్లు రాబ‌ట్టింది. ఆ త‌ర్వాత ప్ర‌భాస్ ప‌లు సినిమాలు చేసినా అనుష్క మాత్రం ఆచితూచి సినిమా తీసింది. ఆమె చేసిన నిశ్శ‌బ్దం మాత్రం అంతే సైలెంట్‌గా వ‌చ్చి వెళ్ళిపోయింది. లాక్‌డౌన్ స‌మ‌యంలోకూడా అనుష్క ఎటువంటి ప్ర‌క‌ట‌న‌లు చేయ‌లేదు. సోష‌ల్‌మీడియాలో కూడా దూరంగా వుంది. కాగా, తాజాగా ఓ సినిమాలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. అది కూడా పాన్ ఇండియా త‌ర‌హాలో వుండ‌బోయే మూవీగా చెబుతున్నారు.
 
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడి వ‌ద్ద ప‌నిచేసిన ర‌మేష్ అనే ద‌ర్శ‌కుడు అనుష్క‌కు ఓ క‌థ చెప్ప‌డం, అది న‌చ్చ‌డం జ‌రిగింద‌ని స‌మాచారం. కాగా, ఈ సినిమాను గ‌తంలో `భాగ‌మ‌తి` సినిమాను నిర్మించిన యువీ క్రియేష‌న్స్‌లో నిర్మించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఆ బేన‌ర్‌లో ఆమె ఇచ్చిన హిట్‌తోపాటు ఆ బేన‌ర్ ప్ర‌భాస్ స్నేహితులది కావ‌డం విశేషం. అయితే క‌థ‌బాగా న‌చ్చి అంగీక‌రించింద‌ని టాక్ ఫిలింన‌గర్‌లో వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఆమె అభిమానులు ఆమె సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. తెలుగులో విజ‌య‌శాంతి త‌ర్వాత అంత‌టి ఫెరేష్‌లో న‌టించే న‌టి అనుష్క ఈసారి ఎటువంటి ప్ర‌యోగం చేయ‌నుందో చూడాల్సిందే. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.