ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 26 జనవరి 2017 (15:38 IST)

ఎస్ఎస్.రాజమౌళి - ప్రభాస్ - అనుష్కల 'బాహుబలి 2' పోస్టర్‌ అదుర్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి, ప్రభాస్ - అనుష్క, రానాతో కలిసి తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి'. దాదాపు రెండు సంవత్సరాలు కష్టపడి ఎంతో ప్రతిష్టాత్మక

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి, ప్రభాస్ - అనుష్క, రానాతో కలిసి తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి'. దాదాపు రెండు సంవత్సరాలు కష్టపడి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఫ్యూజువల్ వండర్ అశేష ప్రజాదరణ పొందింది. 
 
ప్రస్తుతం ఇప్పుడు 'బాహుబలి 2' చిత్రం ఇటీవలే పూర్తి చేసుకుంది. దీంతో ప్రభాస్, రానాలకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా 'బాహుబలి 2' కి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఫోటోలో ప్రభాస్, అనుష్క శత్రువులపై బాణం సందిస్తున్నట్లుగా ఉంది. సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ హల్ చల్ చేస్తుంది. 
 
ఈ పోస్టర్ విడుదలతో దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్‌ను మొదలు పెట్టేశాడు. సినిమా చిత్రీకరణ పూర్తయి గ్రాఫిక్స్‌ వర్క్‌ జరుగుతున్నాయి. రిపబ్లిక్‌డే సందర్భంగా గురువారం రెండో భాగానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. 
 
ప్రభాస్‌, అనుష్క ఇద్దరూ విల్లంబులు ఎక్కుపెట్టిన ఆ పోస్టర్‌ ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని అనుకున్నట్లుగా వేసవిలో విడుదల చేయడానికి చిత్రయూనిట్‌ సిద్ధం చేస్తుంది. కల్పిత గాథతో కూడిన బాహుబలి. ది బిగినింగ్‌ విడుదలై ప్రపంచాన్ని ఆకర్షించింది. మరి ఈ భాగం ఇంకెంత పేరు క్రియేట్‌ చేస్తుందో చూడాల్సిందే.