శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2017 (17:15 IST)

తాకకూడని చోట తాకిన నటుడు.. చెంప పగులగొట్టిన 'బాహుబలి' ఐటెం గర్ల్ (Video)

ప్రభాస్ హీరోగా, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన "బాహుబలి : ది బిగినింగ్" చిత్రంలో ఓ ఐటెంసాంగ్ ఉంది. మనోహర్ అంటూ ఈ పాటలో స్కార్లెట్ విల్సన్ నటించింది. అయితే, ఇపుడు ఈ భామ ఓ నటుడి చెంప ఛెళ్లుమనిపి

ప్రభాస్ హీరోగా, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన "బాహుబలి : ది బిగినింగ్" చిత్రంలో ఓ ఐటెంసాంగ్ ఉంది. మనోహర్ అంటూ ఈ పాటలో స్కార్లెట్ విల్సన్ నటించింది. అయితే, ఇపుడు ఈ భామ ఓ నటుడి చెంప ఛెళ్లుమనిపించింది. ఇంతకీ చెంపపగులగొట్టించుకున్న నటుడు ఎవరన్నదే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. 
 
బాలీవుడ్ సినిమా 'హన్స: ఏక్ సన్యోగ్' అనే సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉమాకాంత్ రాయ్ అనే నటుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడట. తాక కూడని చోట తాకడమేకాక, ఆమె జుట్టు పట్టుకుని లాగాడట. 
 
దీంతో, ఒక్కసారి ఆగ్రహానికి గురైన స్కార్లెట్... ఉమాకాంత్ చెంపను పగలగొట్టింది. ఈ ఘటనతో అతను అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోయాడు. యూనిట్ సభ్యులు కూడా అతన్ని బలవంతంగా బయటకు పంపించేశారు. పైగా, ఈ విషయాన్ని ఫిల్మ్ చాంబర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆ నటుడి సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.