ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 27 మార్చి 2017 (03:24 IST)

అయిదేళ్ల బాహుబలి యజ్ఞం ముగిసిందా.. ప్రీ రిలీజ్ కార్యక్రమంలో ఎవరేమన్నారు?

భారతీయ వెండితెరపై 67 సంవత్సరాల క్రిత ముఘల్-ఇ-అజమ్ సినిమా సృష్టించిన మ్యాజిక్‌ను బాహుబలి ఇప్పుడు తోసిపుచ్చింది. రాజమౌళి సినిమాకు ఆత్మ ఉంటుంది. తన వ్యక్తిత్వంలో అపారమైన ప్రజ్ఞ ఉంది. దాంట్లో కనీసం 10 శాతం ప్రజ్ఞ కూడా నాకు లేదు.

బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరిగింది. ముంబై నుంచి కరణ్ జోహార్ వంటి ప్రముఖ చిత్ర నిర్మాత విచ్చేసిన ఈ కార్యక్రమంలో అయిదేళ్ల పాటు సాగిన  బాహుబలితో తమ అనుబంధాన్ని నటీనటులు, సాంకేతిక నిపుణులు పంచుకున్నారు. ప్రీ-రిలీజ్ సందర్భంగా ఈవెంట్‌లో పాల్గొన్న నటీనటులు, ఇతరులు ఎవరేమన్నారో చూద్దాం.
 
భారతీయ వెండితెరపై 67 సంవత్సరాల క్రిత ముఘల్-ఇ-అజమ్ సినిమా సృష్టించిన మ్యాజిక్‌ను బాహుబలి ఇప్పుడు తోసిపుచ్చింది. రాజమౌళి సినిమాకు ఆత్మ ఉంటుంది. తన వ్యక్తిత్వంలో అపారమైన ప్రజ్ఞ ఉంది. దాంట్లో కనీసం 10 శాతం ప్రజ్ఞ కూడా నాకు లేదు. భారతీయ సినిమా చరిత్రలో ఇది అతిపెద్ద ఈవెంట్. చిత్ర నిర్మాణం పట్ల అంకిత భావం అంటే ఇదే. ఇది చిత్ర నిర్మాణ, దర్శకుల అసలు బలానికి సంకేతం ఇదే. ముంబై వెళ్లాక దీనిగురించే బాలీవుడ్‌కి చెబుతాను. బాహుబలి వంటి మెగా ప్రాజెక్టులో ఒక చిన్న భాగం చేపట్టేందుకు అంగీకరించినందుకుగాను చిత్ర నిర్మాతలకు కృతజ్ఞతలు. బాహుబలి చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి ఉన్న ప్రజ్ఞాపాటవాల్లో కనీసం పది శాతం కూడా నాకు లేదు. 
- బాలీవుడ్ సుప్రసిద్ధ నిర్మాత కరణ్ జోహార్ 
 
మీ కోసమైనా ఏడాదికి ఇకపై రెండు సినిమాలు తీయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను డార్లింగ్స్..
- ప్రభాస్
 
జీవితంలో ఇలాంటి సినిమా మళ్లీ వస్తుందని కానీ, ఇంలాటి పవర్ పుల్ పాత్ర మళ్లీ నాకు దొరుకుతుందని కానీ నమ్మకం లేదు. కానీ ఒక చరిత్రలో నిలబడనున్న అత్యద్భుత సినిమాలో నటించామన్న తృప్తి మాత్రం మిగిలే ఉంటుంది. జీవితంలో ఎన్ని సినిమాలు తీసినా నా ఫేవరేట్ కోస్టార్ మాత్రం ప్రభాసే.
- దగ్గుబాటి రానా
 
ప్రభాస్‌కు ఎమి ఉన్నాయో, ఏమి లేవో నాకు తెలుసు. తనకు మంచి మనసు ఉందని, అలాగే గర్వం లేదని అన్నారు. ఎవరితో పట్టింపులేకుండా వ్యవహరించడం ఆయనకు చాతకాదు.
సంగీత దర్శకులు ఎమ్.ఎమ్.కీరవాణి 
 
‘హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ స్టీవెన్ స్పీల్ బర్గ్‌ను ఇండియన్ సినిమా గురించి ప్రశ్నించగా ‘నో కామెంట్’ అని ఓ సందర్భంలోఅన్నారు. అతన్ని పట్టి పట్టి అడగ్గా ఒకే ఒక్క కథని ఇన్ని వందల సినిమాలు, ఇన్ని సంవత్సరాలు ఎలా తీశారని ఎద్దేవా చేశారు. కాని ఇప్పుడు బాహుబలి సినిమా చూడండి, తర్వాత మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇండియన్ సినిమాలో అందునా తెలుగు ఇండస్ట్రీలో ఇంత గొప్ప టెక్నీషియన్స్ ఉన్నారా అనుకునే విధంగా రాజమౌళి నిరూపించారు. ఇది చాలా గర్వకారణం’
కృష్ణంరాజు 
 
40 ఏళ్ల తన సినీజర్నీలో 230 సినిమాలు చేశాను. అయితే కట్టప్ప పాత్రకు వచ్చిన గుర్తింపు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఇప్పుడు అంతా కట్టప్పగానే నన్ను సంబోధిస్తున్నారు.
సత్యరాజ్
 
ఈ పాత్రల్లో ఇప్పటికే నటించిన వారిని ఎంతగానో ఊహించుకున్నాం, ప్రేమించాం. వేరెవరినీ వాళ్ల పాత్రల్లో ఊహించుకోలేం. బాహుబలి పార్ట్-2 త్వరగా పూర్తి చేసి ఈగ పార్ట్-2 తీస్తే ఇంక హ్యాపీగా ఫీలవుతాను. 
హీరో నాని