శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 26 మే 2021 (13:15 IST)

అభిమానుల‌కు స‌ర్‌ప్రైజ్ ఇస్తున్న బాల‌కృష్ణ‌

NTR poster
ఎన్‌.టి.ఆర్‌. అభిమానుల‌కు స్మాల్ స‌ర్‌ప్రైజ్‌, చూస్తూ ఉండండి. రేపు 8.45కు అంటూ ఎన్.బి.కె. ఫిలిమ్స్ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఇంత‌కీ ఏమిటా స‌ర్‌ప్రైజ్ అనేది అభిమానుల్లో చాలామందికి తెలిసినా. అంద‌రికీ తెలియాల్సి వుంది. మేనెల 28న యన్టీఆర్ జయంతి. క‌నుక ఆ రోజుకోసం ముందుగానే రెండు రోజుల‌కు ముందు ప్ర‌క‌టిస్తున్నారు.
 
మ‌ర‌లా ఎన్‌.టి.ఆర్‌. బ‌యోపిక్‌కు సంబంధించిన విష‌యాల‌యితే కాదు. కానీ అంత‌కంటే ఎక్కువైంది గా బాల‌క‌య్య మ‌దిలో వుంది. వైశాఖ మాసం. ఇప్పుడు క‌రోనా కాలం క‌నుక అంద‌రూ బాగుండాల‌నే ప్లాన్ లో వున్న‌ట్లున్నాడు. బాల‌కృష్ణ న‌టుడేకాదు గాయ‌కుడు కూడా. అందుకే త‌న తండ్రి 99వ జయంతి సందర్భంగా బాలకృష్ణ తండ్రికి నివాళిగా తన గానంతో ‘శ్రీరామదండకం’ విడుదల చేయనున్నారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు ఉదయం 8.45కి రాబోతోందని తెలుస్తోంది.
 
ముహూర్తాలు కూడా బాగా తెలిసిన బాల‌కృష్ణ‌, మే 28న ఉదయం 9.44 గంటల తరువాత బాలకృష్ణ గానం చేసిన ‘శ్రీరామదండకం’ విడుదల కానుంది. యన్టీఆర్ పోషించిన శ్రీరాముని పాత్రల బొమ్మలపై బాలయ్య గానం చేసిన ‘శ్రీరామదండకం’ గద్యం పోస్ట్ చేసి వీడియోను విడుదల చేయనున్నారు. శ్రీరామపాత్రలో అనితరసాధ్యంగా అభినయించిన రామారావు బొమ్మలు, వాటిపై బాలయ్య గానం చేసిన ‘శ్రీరామదండకం’ గద్యం నందమూరి అభిమానులకు ఆనందం పంచుతుందని భావిస్తున్నారు. ఇంత‌కుముందు ఎన్టీయార్ ‘జగదేకవీరుని కథ’లోని శివశంకరీ గీతాన్ని తన పుట్టిన రోజు సందర్భంగా బాల‌కృష్ణ ఆలపించారు.