గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 25 మే 2021 (16:41 IST)

హైదరాబాద్ క్యాంపస్‌లో కొవిడ్-19 కేర్ ఐసోలేషన్ కేంద్రం ప్రారంభించిన వెర్ట్యూసా

వెర్ట్యూసా కార్పొరేషన్, డిజిటల్ స్ట్రాటజీ, డిజిటల్ ఇంజనీరింగ్, ఐటి సేవలు మరియు పరిష్కారాలను అంతర్జాతీయంగా అందించే సంస్థ, ఈరోజు తమ హైదరాబాద్ క్యాంపస్‌లో తమ 24/7 కొవిడ్-19 కేర్ ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించింది. దేశంలోని తమ ప్రధాన కార్యాలయ ప్రాంగణాల వ్యాప్తంగా ఇదే విధమైన కేంద్రాలను ప్రారంభించే ప్రక్రియలో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. ఇటీవలే, తమ టీమ్ సభ్యుల కోసం ఒక కొవిడ్ కేర్ పోర్టల్‌ను వెర్ట్యూసా ప్రారంభించింది, కంపెనీ ద్వారా తీసుకుంటున్న తదుపరి చర్యలకు ఈ కేంద్రం చిహ్నంగా నిలుస్తోంది.
 
వెర్ట్యూసా ఐసోలేషన్ కేంద్రంలో 30 పడకలు, స్నాన సౌకర్యాలు, వాష్ రూమ్స్ ఉన్నాయి, అడ్మిట్ అయిన వారి కోసం రోజుకు 3 భోజనాలు, పోషక పానీయాలు అందజేస్తారు. రెనోవా ఆసుపత్రికి చెందిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఈ కేంద్రంలో ఉంటారు, దీన్ని ఒక వైద్య అధికారి పర్యవేక్షిస్తారు. కేంద్రంలో ఉండే సిబ్బందిలో ప్రతి ఒక్కరికీ పిపిఇ కిట్లు, ప్రభుత్వం నిర్దేశించిన ఇతర భధ్రతా సౌకర్యాలన్నీ తప్పనిసరి.
 
ఈ కేంద్రం ప్రాథమికంగా వెర్ట్యూసా టీమ్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, వినియోగదారులకు సేవలు అందిస్తుంది. రోగులందరికీ వైద్యులు, నర్సుల నిరంతర పర్యవేక్షణ ఉంటుంది, అవసరమైన వైద్యం అందజేయడం జరుగుతుంది. ఐసోలేషన్ కేంద్రంలో ఉన్న రోగులకు రెనోవా ఆసుపత్రుల వైద్యులు, నర్సులు చికిత్స చేస్తారు, పర్యవేక్షిస్తారు, అవసరంలో ఉన్న వారికి తక్షణ సహాయాన్ని అందజేయడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ భాగస్వామ్యం మరో ముందంజ.
 
సుందర్ నారాయణన్, చీఫ్ పీపుల్ ఆఫీసర్, వెర్ట్యూసా మాట్లాడుతూ, “మా టీమ్ సభ్యులు, వారి కుటుంబాలు, మా క్లయింట్ల కోసం మా కొవిడ్ కేర్ కవర్ కింద అనేక కార్యక్రమాలను మేము ప్రవేశపెట్టాం. మా టీమ్ సభ్యులకు అత్యుత్తమ సంభావ్యమైన సంరక్షణ అందించడానికి మా ప్రయత్నాల్లో ఈ కేంద్రం మరొక అడుగు. రెనోవా ఆసుపత్రులకు వారి భాగస్వామ్యం అందిస్తున్నందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కష్టమైన కాలంలో ప్రతి ఒక్కరు సవాలును ఎదుర్కోవడానికి ముందుకు రావడం ప్రధానం” అని అన్నారు.
 
వైద్య అత్యవసర పరిస్థితుల్లో సాయం అందించడానికి అందుబాటులో ఉండేలా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల కోసం వెర్ట్యూసా ఆర్డర్ చేసింది. వైద్యులతో, పోషకాహార నిపుణులతో, ఆరోగ్య నిపుణులతో ఉచిత ఆన్-లైన్ కన్సల్టేషన్‌ను కూడా రోజంతా అందిస్తోంది. దీనితోపాటు, వైద్య అత్యవసర పరిస్థితుల కోసం తన ఉద్యోగుల సంక్షేమ నిధిని వినియోగిస్తోంది, అలాగే ఏ టీమ్ సభ్యునికైనా అవసరమైనప్పుడు అందించడానికి మానసిక, శారీరక ఆరోగ్యం కోసం విర్ట్యువల్ కనెక్ట్ చొరవలను కూడా తీసుకుంటోంది. సేవలందించడం, వినియోగదారుల కేంద్రతకు భంగం కలగకుండానే ఈ చర్యలన్నీ చేపడుతోంది.