ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2019 (13:27 IST)

ఆ హీరోల కారణంగా వెనక్కి తగ్గిన బాలయ్య...

సీనియర్ హీరోలలో ఒకరైన నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ వైపు తన రాజకీయ కెరీర్‌ను కొనసాగిస్తూనే వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలయ్య..ఆ తర్వాత  సినిమాను కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు.

ఇది ఆయన కెరీర్‌లో వస్తున్న 105వ సినిమా. దీనికి రూలర్ అనే టైటిల్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే బ్యాంకాక్‌లో షూటింగ్ పూర్తి చేసుకుని, ఇప్పుడు మిగతా సీన్స్ అన్నింటినీ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా పూర్తి చేస్తోంది ఈ చిత్రయూనిట్.

ప్రతి సంవత్సరం సంక్రాంతి కానుకగా తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడం బాలకృష్ణ స్టైల్. అదే విధంగానే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావించి, పనులన్నీ పూర్తి చేస్తున్నప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి బాలకృష్ణ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.
 
దీనికి కారణం, ఇప్పటికే యంగ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్‌ సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నయి. వీటితో పాటు ఇంకొన్ని సినిమాలు కూడా ఆ సమయంలో రిలీజ్ కాబోతున్నాయి. ఇది గమనించిన బాలయ్య ఆలోచించి, కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

సంక్రాంతి పండుగ కంటే ముందే, అంటే డిసెంబర్ నెల చివరిలో తన సినిమాను విడుదల చేసేలా ఆయన ప్లాన్ చేస్తున్నారట. దీనికి మరొక కారణం కూడా లేకపోలేదు. అప్పుడు అయితే థియేటర్ల కొరత కూడా ఉండదు, కాబట్టి తమ సినిమాను ఎక్కువ థియేటర్లలో విడుదల చేయొచ్చనే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు.

ఇప్పటికే ఈ సినిమాలో బాలకృష్ణ కనిపించిన డిఫెరెంట్ లుక్‌కు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమాకు సి. కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తుంగా సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.