శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: మంగళవారం, 4 జూన్ 2019 (21:43 IST)

జగన్ దెబ్బతో సినిమానే వద్దనుకున్న బాలయ్య.. ఎందుకు?

బాలక్రిష్ణ సినిమా ఇప్పట్లో మొదలయ్యే అవకాశమే లేదు. కె.ఎస్.రవికుమార్ ఆల్రెడీ సినిమాను అనౌన్స్ చేసినా సినిమా మాత్రం క్యాన్సిల్ అయిందట. కథ ఓకే అయ్యింది. బాలయ్య డేట్స్ కూడా ఇచ్చేశారు. ఇక మొదలు కావడమే ఆలస్యం అనుకుంటే ఉన్నట్లుండి రద్దయ్యింది.
 
మహానాయకుడు తరువాత బోయపాటి లైన్‌లో ఉన్నా జై సింహా వంటి హిట్ ఇచ్చినా కె.ఎస్.రవికుమార్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలయ్య. ఇద్దరు హీరోయిన్స్‌తో సంప్రదింపులు జరిగాయి. మ్యూజిక్ డైరెక్టర్‌గా చిరంతన్ భట్‌ను తీసుకున్నారు. విలన్‌గా జగపతిబాబు పేరు అనౌన్స్ చేశారు.
 
రెగ్యులర్‌గా షూటింగ్ కొనసాగించి సంక్రాంతికి పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట. అయితే ఉన్నట్లుండి సినిమాను క్యాన్సిల్ చేసేసుకున్నారట. బాలక్రిష్ణ, కె. ఎస్.రవికుమార్ మూవీ కథ.. రాజకీయ నేపథ్యంగా సాగుతుందని, ఎపి పాలిటిక్స్ ఉంటాయని తెలిసింది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా చేస్తే రిస్క్ అవుతుందని బాలయ్య భావించారట. దీంతో ఈ సినిమాను పక్కన పెట్టేశారట.