శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 4 జూన్ 2019 (17:12 IST)

మనసున్న మారాజు జగనన్న... బ్యానర్లు చూసి కాన్వాయ్ ఆపి...

నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్. జగన్ మోహన్ రెడ్డి మరోమారు తన మంచి మనసును చాటుకున్నారు. నిన్నటికి నిన్న ఆశా వర్కర్ల వేతనాలను 300 శాతం మేరకు పెంచిన జగన్... మంగళవారం ఓ కేన్సర్ యువకుడుకి చికిత్స చేయించాల్సిందిగా ఆదేశించారు. 
 
మంగళవారం జగన్ విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకోసం ఆయన అమరావతి నుంచి విశాఖకు ప్రత్యేక విమానంలో వెళ్ళారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో శారదాపీఠానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు.
 
తిరుగు ప్రయాణంలో విశాఖ విమానాశ్రయం వద్ద కొందరు యువకులు బ్యానర్లు చేతపట్టుకుని నిలుచున్నారు. నీరజ్ అనే తమ స్నేహితుడు కేన్సర్‌తో బాధపడుతున్నాడనీ, అతడికి సాయం చేయాల్సిందిగా వారు ఆ బ్యానర్లు, ప్లకార్డులను ప్రదర్శించారు. 
 
అంతే.. తన కాన్వాయ్‌ను ఆపి జగన్ వాహనం దిగి వారివద్దకు వెళ్లి ఆ యువకులతో మాట్లాడారు. మీ సమస్య ఏంటని ప్రశ్నించారు. నీరజ్ అనే కుర్రోడు కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడూ హైదరాబాద్ బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడనీ అతనికి చికిత్స చేయించాలని ప్రాధేయపడ్డారు. 
 
తమ స్నేహితుడు పట్ల వారు చూపిస్తున్న తాపత్రయం జగన్‌ను కదిలించింది. వెంటనే అక్కడే ఉన్న విశాఖ జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌ను పిలిచి తక్షణం చికిత్సకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. ఖర్చును అంచనా వేసి నిధులు తక్షణం విడుదల చేయాలని ఆదేశించారు. జగన్ స్పందనకు ఆశ్చర్యపోయిన నీరజ్ స్నేహితులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతున్నారు.