బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (13:28 IST)

బాలకృష్ణ "గాడ్‌ఫాదర్" దిల్ రాజు సొంతం

నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "గాడ్ ఫాదర్" (ఇంకా అధికారికంగా ప్రకటించలేదు). వీరిద్దరి కాంబినేషన్‌లో 'సింహా, లెజెండ్' చిత్రాల వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. 
 
ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే టైటిల్ పరిశీనలో ఉంది. ప్ర‌గ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో మ‌రో హీరోయిన్ పూర్ణ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
స్వర్గీయ ఎన్.టి.రామారావు జయంతి సందర్భంగా మే 28న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత ప్ర‌క‌టించారు. అయితే, సినిమాపై ఉన్న క్రేజ్‌తో సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే సినిమాకు ఫ్యాన్సీ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయని సినీ వ‌ర్గాల స‌మాచారం. ఇప్ప‌టికే ఆంధ్ర ఏరియా థియేట్రిక‌ల్ హ‌క్కులు రూ.35కోట్లకు అమ్ముడ‌య్యాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. 
 
ఈ నేప‌థ్యంలో బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం నైజాం, ఉత్త‌రాంధ్ర హ‌క్కుల‌ను ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు రూ.16 కోట్ల రూపాయ‌లకు ద‌క్కించుకున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కాంబినేష‌న్‌పై ఉన్న క్రేజ్‌తో ఒక్కొక్క ఏరియా హ‌క్కుల‌ను సొంతం చేసుకోవ‌డానికి డిస్ట్రిబ్యూట‌ర్స్ పోటీ ప‌డుతున్నట్టు ఫిల్మ్ ట్రేడ్ వర్గాల సమాచారం.