బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన భోలే
తెలంగాణ గాయకుడు భోలే షావలిని బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. పదోవారం నామినేషన్స్‌లో శివాజీ, గౌతమ్, భోలే, యావర్, రతికలు ఉన్నారు. అయితే ఏ అన్ అఫీషియల్ పోల్ చూసినా.. రతిక ఎలిమినేట్ అవుతుందనే రిజల్ట్ వచ్చింది.
కానీ.. ఈవారం కూడా ఆడియన్స్ ఓట్లను పక్కనపెట్టి.. రతికను సేవ్ చేయడం కోసం భోలే షావలిని ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి బిగ్ బాస్‌కి రాకముందు వరకూ భోలే గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.
కానీ.. బిగ్ బాస్‌కి వచ్చిన తరువాత.. అతనెంత టాలెంటెడ్ సింగరో తెలిసింది. పల్లవి ప్రశాంత్ తండ్రి వచ్చినప్పుడు.. బంతి పూలుపై పాడిన పాట కానీ.. తన భార్య వచ్చినప్పుడు భార్య గొప్పదనం గురించి చెప్పిన పాట కానీ.. అర్జున్ భార్య సీమంతం పాట కానీ.. హీరో కార్తీ గెస్ట్‌గా వచ్చినప్పుడు ఆయనపై పాడిన పాట కానీ.. ఇలా ప్రతిదీ అప్పటికప్పుడు ట్యూన్ కట్టి ఔరా అనిపించేట్టుగానే డప్పు బిడ్డ ప్రతిభ చూపించాడు. ఇకపోతే.. వారానికి ఆయన రూ.1.25 లక్షలు వసూలు చేశాడని టాక్ వస్తోంది.