శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: మంగళవారం, 24 జులై 2018 (19:57 IST)

రాజమౌళి వివాదం...? అర్థరాత్రి బిగ్ బాస్ ఇంట్లోకి దూరిన ఆమె ఎవరు?

బిగ్‌బాస్‌ ఇంట్లో ఏ రోజు ఏ వివాదం తలెత్తుతుందో, అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చెప్పలేం. తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి వివాదం రాజుకుంది. బాబు గోగినేని రాజమౌళి గురించి ఏవో వ్యాఖ్యలు చేశారట, ఆ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌశల్‌ వివాదం

బిగ్‌బాస్‌ ఇంట్లో ఏ రోజు ఏ వివాదం తలెత్తుతుందో, అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చెప్పలేం. తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి వివాదం రాజుకుంది. బాబు గోగినేని రాజమౌళి గురించి ఏవో వ్యాఖ్యలు చేశారట, ఆ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌశల్‌ వివాదం లేవనెత్తారు. ఇదేకాకుండా… 43వ రోజు బిగ్‌బాస్‌ ఇంట్లో మరికొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
 
ఏడో వారానికి సంబంధించి బిగ్‌బాస్‌ ఇంట్లో ఎలినిమేషన్‌ ప్రక్రియ మొదలయింది. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న ఇద్దరు సభ్యుల నెత్తిపైన ప్రతి సభ్యుడు కోడుగుడ్డు పగలగొట్టాలి. కౌశల్‌ నెత్తిన ఎక్కువ గుడ్లు పగిలాయి. దీనికి ఏవేవో కారణాలు చెప్పారు. తనిష్‌, దీప్తి, సామ్రాట్‌ తప్ప అందరి నెత్తినా గుడ్లు టఫీటఫీమని పగిలాయి. అంటే అందరూ నామినేట్‌ అయినట్లే లెక్క. ఇంత జరిగాక చివర్లో బిగ్‌బాస్‌ ఓ ట్విస్ట్‌ ఇచ్చారు. ఈ వారం నామినేషన్లు ఉండబోవని, నామినేషన్‌ కోసం ఓట్లు వేయాల్సిన అవసరం లేదని ప్రకటించారు.
 
నామినేషన్ల ప్రక్రియ సందర్భంలోనే రాజమౌళి వివాదం వచ్చింది. కౌశల్‌ బాబు గోగినేని నెత్తిపైన గుడ్డు పగలగొడుతూ… మీరు మా సినీ నటులకు ఆరాధ్య దైవమైన రాజమౌళిని విమర్శించారు. ఆయన నాస్తికుడని చెప్పుకుంటూ రాఘవేంద్రస్వామి మఠానికి వెళ్లారు.. అని విమర్శించారు. ఇంట్లో అటువంటి విమర్శలు ఎందుకు చేస్తారు? ఇది నాకు నచ్చలేదు. అందుకే మిమ్మల్ని నామినేట్‌ చేస్తున్నాను’ అని చెప్పాడు కౌశల్‌. వాస్తవంగా బాబు గోగినేని రాజమౌళిపై అలాంటి వ్యాఖ్యలు ఎప్పుడు చేశారోగానీ…. టివిలో మాత్రం ప్రసారం కాలేదు. కౌశల్‌ లేవనెత్తిన తరువాతే….ప్రేక్షకులకు తెలిసింది.
 
ఆ తరువాత జరిగిన చర్చల్లో…. బాబు గోగినేని మాట్లాడుతూ ‘నేను రాజమౌళిపై విమర్శలు చేస్తే ఆయన సమాధానం చెప్పుకుంటారు… మధ్యలో ఈ స్పోక్స్‌మాన్‌ ఆయనకు కావాలా’ అంటూ కౌశల్‌ను ఉద్దేశించి మాట్లాడారు. బిగ్‌బాస్‌ ఇంట్లో తలెత్తిన ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి. బిగ్‌బాస్‌ షోలో ఇంకో రెండు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటిదాకా ఆరుగురు సభ్యులు ఎలిమినేట్‌ అయ్యారు. ఇందులో ఒకరిని వచ్చేవారం మళ్లీ లోనికి పంపబోతున్నారు. 
 
ఇందుకోసం ఓట్లు వేయాల్సిందిగా కోరారు బిగ్‌బాస్‌. సంజన, నూతన్‌ నాయుడు, కిరీటి, శ్యామల, భాను, తేజస్వీ…. ఈ ఆరుగురిలో ఎవరో ఒకరు మళ్లీ బిగ్‌బాస్‌ ఇంట్లో అడుగుపెట్టబోతున్నారు. ఇదిలావుండగా… 43వ రోజు అర్థరాత్రి అందరూ నిద్రలో ఉండగా… బిగ్‌బాస్‌ ఇంటి తలుపు తీసుకుని ఓ సభ్యురాలు ఇంట్లోకి అడుగుపెట్టారు. గప్‌చిప్‌గా సోఫాలో పడుకుని, దుప్పటి కప్పుకున్నారు. కౌశల్‌ ఆమెను గుర్తించారు. ఇంతకీ ఆమె ఎవరు, ఇంట్లో ఉండటానికే వచ్చిందా? లేక సరదా కోసం పంపించారా? అనే వివరాలు తరువాతి ఎపిసోడ్‌లో తెలుస్తాయి.