మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 సెప్టెంబరు 2021 (14:13 IST)

నెక్ట్స్ బ్యాగ్ సర్దుకునేది.. ఉమాదేవినేనా... బిగ్‌బాస్ గేమింగ్ స్ట్రాటజీ చూస్తే..?

బిగ్‎బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా కొనసాగుతుంది. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు ఓ రేంజ్‌లో ఉన్నాయి. పొమ్మన లేక పొగపెట్టడు అన్నట్టు బిగ్ బాస్ ప్రవర్తిస్తున్నాడు. మొదటి ఎలిమినేషన్‌లో ట్విస్ట్ మాములుగా లేదు.. ఎవ్వరూ ఉహించని విధంగా ఎలిమినేషన్ జరిగింది.

బిగ్ బాస్‌ని దమ్ దమ్ చేస్తానని హౌస్ లోకి వచ్చిన సరయును.. తొలివారంలోనే హౌస్ నుంచి గెటౌట్ అనేశాడు. బిగ్‌బాస్ గేమింగ్ స్ట్రాటజీ చూస్తే.. అనేక రకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓటింగ్ ప్రకారం కాకుండా.. బిగ్ బాస్ అనుకున్నట్టు జరుగుతుందని అనుమానాలు వెల్లువెత్తున్నాయి.
 
ఇదిలాఉంటే.. మరో కంటెస్టెంట్‌ను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ ప్లానింగ్ ప్రకారం.. ఎవరినైతే .. హౌస్ నుంచి గెంటివేయాలని బిగ్ బాస్ ఫిక్స్ అవుతాడో .. వారిని టార్గెట్ చేస్తాడు. తొలుత వారి క్రేజ్‌ని తగ్గించేలా .. ఫ్లానింగ్ చేస్తున్నాడు. ఆ ఫ్లానింగ్ అనుగుణంగానే పావులు కదుపుతున్నాడు బిగ్ బాస్‌. వాళ్లని నెగిటివ్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. వారికి స్క్రీన్ మీద కనిపించకుండా చేస్తున్నాడు. సదరు కంటెస్టెంట్‌ను చాలా బ్యాడ్ చూపిస్తున్నాడు. ఇదే బిగ్ బాస్ స్ట్రాటజీ..
 
గతంలో సరయు కూడా ఇదే తరహాలో టార్గెట్ చేశాడు. ఆమె కాజల్‌తో గొడవ పడేలా చేయడం. ఆమె సిగరెట్ తాగడం. ఇతరులను తిట్టే సీన్లులను చూపించడం. ఈమె ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అనుకునేలా చేశాడు బిగ్‌బాస్
 
ఇక ఈవారం ఎలిమినేషన్ ప్రాసెస్ చూస్తే.. ఇదే తరహాలో గేమ్ స్ట్రాటజీని అమలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ సారి కార్తీక దీపం ఉమాదేవిని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఆమెను ఎలాగైనా బయటకు పంపాలని గట్టిగానే ఫిక్స్ అయినట్టు అనిపిస్తుంది. 
 
అందుకే ఆమెను ఓ రేంజ్‌లో టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆమెను అందరి ముందు నెగిటివ్ గా చూపించేలా.. ఆమె పచ్చి బూతులు మాట్లాడుతున్నవి. వంటగదిలో బంగాళాదుంప కర్రీ వద్ద గొడవ. ప్రియాంక వచ్చి సారీ చెప్పినప్పుడు కూడా తన యాటిట్యూడ్ చూపించినట్టు చేయడం. వంటి సీన్లను టెలికాస్ట్ చేస్తున్నారు. దీంతో ప్రతి ప్రేక్షకుడు ఉమా దేవిని బండబూతులు తిట్టుకునేలా చేస్తున్నాడు. ప్రేక్షకుల్లో నెగిటివ్ ఫీలింగ్ వచ్చేలా చేస్తున్నారు.
 
ఇదిలానే కొనసాగితే.. ఈ వారం ఉమాదేవి ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే బిగ్ బాస్ ఎక్కడా తగ్గకుండా.. ఉమదేవిని నెటిగివ్‌గా చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇన్ని చూస్తే.. నెక్స్ బ్యాగ్ సర్దుకునేది.. ఉమదేవినే అనిపిస్తుంది. వీటన్నింటికి .. సరయు ఆరోపణలు కూడా కొంతవరకు ఊతమిస్తున్నాయి. 
 
హౌస్‌లో ఆమె కంటె దారుణంగా మాట్లాడిన వాళ్లు ఉన్నారనీ, కానీ వారికి సంబంధించిన సీన్లను టెలికాస్ట్ చేయాలేదని ఆరోపించింది. ఎవర్నైతే బయటకు పంపించాలని అనుకుంటున్నారో వాళ్లనే టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది సరయు.