శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 మార్చి 2018 (13:21 IST)

కన్నీరు పెట్టిస్తున్న ఇర్ఫాన్ ఖాన్ ట్వీట్... రేర్ డిసీజ్‌తో బాధపడుతున్నానంటూ....

బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన విలక్షణ నటుల్లో ఇర్ఫాన్ ఖాన్ ఒకరు. ఆయన ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. దీనిపై ఆయన తాజాగా చేసిన ట్వీట్ ఇపుడు ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది.

బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన విలక్షణ నటుల్లో ఇర్ఫాన్ ఖాన్ ఒకరు. ఆయన ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. దీనిపై ఆయన తాజాగా చేసిన ట్వీట్ ఇపుడు ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది. 
 
గత 15 రోజులుగా తాను వణికిపోతున్నానని ఓ రేర్ డిసీజ్ తన శరీరంలో ఉందని డాక్టర్లు తేల్చారని చెప్పాడు. తనకున్న రుగ్మతపై అభిమానులు ఎవరికి తోచినట్టు వారు ఊహించుకోవద్దని, మరో వారం పది రోజుల్లో ఈ రోగం గురించిన మొత్తం విషయాన్ని వెల్లడిస్తానని, తనకు మేలు కలగాలని దైవాన్ని ప్రార్థించాలని కోరారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో తాను కొన్నిసార్లు నిద్రలేవగానే దిగ్భ్రాంతి చెందే విషయాలు వినాల్సి వస్తుందని, కొంతకాలం నుంచి సస్పెన్స్ స్టోరీగా సాగిన తన జీవితంలో పెను మార్పు వచ్చిందన్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకునే తనకు అటువంటి వ్యాధే సోకిందని, ఈ రోగానికి తలవంచే పరిస్థితి లేదని, పోరాడి తీరుతానని ఇర్ఫాన్ ఖాన్ చెప్పాడు.