శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 జనవరి 2020 (14:22 IST)

విరాట్ కోహ్లీకి నాకు పోలికలు వున్నాయి.. కంగనా రనౌత్

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విరాట్ కోహ్లీకి తనకు పోలికలు ఉన్నాయని కంగనా రనౌత్ వెల్లడించింది. ఎక్కువ అభిమానులను సంపాదించుకున్నామని, అలాగే అనేక వివాదాలు కూడా తాము ఎదుర్కొన్నామని తెలిపింది. విరాట్ కోహ్లీకి తనకు కొన్ని విషయాల్లో పోలికలు ఉన్నాయని కొందరు చెబుతారని వెల్లడించింది. 
 
విరాట్ కోహ్లీ క్రికెట్‌లో గొప్ప పేరు సంపాదించారు. అతనికి ఎంతో మంది ప్రేమిస్తారు. కోహ్లీకి దూకుడు ఎక్కువని విమర్శిస్తుంటారు. కోహ్లీలానే తాను కూడా దూకుడుగా ఉంటా.. మేము ఇద్దరం చాలా వివాదాలు ఎదుర్కొన్నాం. అంతకంటే ఎక్కువ అభిమానులను సంపాదించాం.. ఆటగాళ్ల జీవితం సులువైంది కాదు, ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫిటెనెస్ కోసం శ్రమిస్తారు. ఆటకోసం ఎంతగానో తపిస్తారని కంగనా పేర్కొంది. 
 
ఇకపోతే.. కంగనా రనౌత్ సీనియర్ మహిళా న్యాయవాది ఇందిరా జైసింగ్ వ్యాఖ్యలపై విమర్శలు చేశారు. నిర్భయ తల్లి ఆశాదేవి కూడా కంగనాకు మద్దతుగా నిలిచింది. ‎నిర్భయ దోషులను క్షమించాలని, రాజీవ్ గాంధీ హత్య కేసులో నళినీని సోనియా గాంధీ క్షమించారని, ఆమెకు ఉరిశిక్ష పడాలని కోరుకోలేదని గుర్తు చేశారు. సోనియాను చూసి నిర్భయ తల్లిని కోరుతున్నానని అన్నారు. 
 
అయితే దీనిని కంగనా తప్పుబట్టారు. ఇందిరా జైసింగ్ వ్యాఖ్యలు సరైంది కాదని విమర్శించారు. అలాంటి మహిళలను దోషులతో పాటు నాలుగు రోజుల పాటు జైళ్లో ఉంచాలి, కచ్చితంగా వారితో కలిసి ఉండేలా చేయాలి. అప్పుడే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఇలాంటి వాళ్లే మృగాళ్లకు, హంతకులకు జన్మనిస్తారు అని తీవ్ర స్థాయిలో కంగనా రనౌత్ విమర్శించిన సంగతి తెలిసిందే.