మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 5 ఫిబ్రవరి 2022 (16:07 IST)

ఐదు చిత్రాలు విడుదలకు సిద్ధం చేసుకున్న బోనీ కపూర్- అజిత్‌తో మ‌రో సినిమా

Bonnie Kapoor
బాలీవుడ్ అగ్ర నిర్మాత బోనీ కపూర్  నిర్మాణంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. మిస్టర్ ఇండియా, రూప్ కీ రాణీ చోర్ం కా రాజా, నో ఎంట్రీ, జుదాయీ, వాంటెడ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు ముఖ్యంగా  ఆయన నిర్మించిన చిత్రాలు చాలావరకు తెలుగు, తమిళ్ భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయినా రీమేక్  చిత్రాలే ఎక్కువ. ప్రస్తుతం అజిత్‌ కుమార్ హీరోగా  జీ స్టూడియోస్‌ సంస్థ,  బేవ్యూ ప్రాజెక్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న అజిత్‌ 'వాలిమై' ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది.  హెచ్. వినోద్  దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 24న విడుద‌ల చేస్తున్నారు. అంతే కాకుండా మరో అయిదు భారీ ప్రాజెక్టులతో ఫుల్ జోష్ మీదున్నారు బాలీవుడ్ షో మాన్  బోనీ కపూర్.
 
వివరాల్లో కెళ్తే..  ప్రపంచంలో అత్యధిక మంది ఆదరించే ఫుట్ బాల్ ఆట నేపథ్యంలో యధార్థ కథ ఆధారంగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మైదాన్’. భారత దేశాన్ని ఫుట్ బాల్ రంగంలో ప్రపంచ పటంలో నిలిపిన కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీద్ జీవిత కథ ఆధారంగా ‘మైదాన్’ తెరకెక్కుతోంది. జీవితంలో అయినా, ఆటలోనైనా ఆత్మ విశ్వాసం, కష్టపడే తత్వంతో పాటు ఎన్నో త్యాగాలు చేస్తేనే విజయం వరిస్తుంది. క్రీడా నేపథ్యంలో స్ఫూర్తివంతమైన కథగా ‘మైదాన్’ ను నిర్మిస్తున్నారు. ప్రియమణి, గజరాజ్ రావ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ‘బధాయి హో’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఏ ఆర్ రహమాన్ మ్యూజిక్ డైరెక్టర్.  పాండమిక్ కారణంగా సినిమా విడుదల పలుసార్లు వాయిదా పడుతూ వస్తుంది. గురువారం న్యూ రిలీజ్ డేట్‌ను మూవీ టీం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. 2022 జూన్ 3న ‘మైదాన్’ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో భారీగా స్థాయిలో విడుదల చెయ్యబోతున్నారు.
 
ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఆరి, తాన్యా రవి చంద్రన్, నటిస్తున్న తమిళ్ చిత్రం నెంజుకు నీది ఈ చిత్రానికి అరుణ్రాజా కామరాజ దర్శకుడు కాగా, డిబు నినన్ థామస్.
 
బోనీ కపూర్ తనయ ఝాన్వి కపూర్, సన్నీ కౌశల్, మనోహ్ పహ్వ నటిస్తున్న హిందీ చిత్రం 'మిళి' ఈ చిత్రానికి దర్శకుడు జేవియర్ మాతుకుట్టి కాగా, ఏ ఆర్ రహమాన్ మ్యూజిక్ డైరెక్టర్.
 
 సత్యరాజ్, ఊర్వశి, ఆర్ జె బాలాజీ, అపర్ణ బాలమురళి నటిస్తున్న తమిళ్ చిత్రం 'వీటిలా విషేషంగా' ఈ చిత్రానికి దర్శకుడు ఆర్ జె బాలాజీ కాగా, గిరీష్ గోపాల కృష్ణన్ మ్యూజిక్ కంపోజర్.
పైన పేర్కొన్న అయిదు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉండాగా ఇక బోనీ కపూర్ తాజాగా నిర్మించే  చిత్రం అజిత్ పై మరోసారి  ఫోకస్ పెట్టారు. ఈ చిత్రం 2022 మార్చ్ 9న ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు బోనీ కపూర్. మిగతా నటీనటులు టెక్నీషియన్ వివరాలు త్వరలో ప్రకటిస్తారు.