గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 11 మార్చి 2022 (18:12 IST)

డబ్బులు అడిగితే చంపేస్తామంటున్నారు: బెల్లంకొండ సురేష్, హీరో శ్రీనివాస్ పైన కేసు

టాలీవుడ్ బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ పైన ఆయన కుమారుడు, హీరో శ్రీనివాస్ పైన కేసు నమోదైంది. తను ఇచ్చిన డబ్బులు అడిగితే చంపేస్తానంటూ బెదిరిస్తున్నారంటూ ఓ ఫైనాన్షియర్ కోర్టును ఆశ్రయించారు.

 
పూర్తి వివరాలు చూస్తే... శ్రవణ్ కుమార్ అనే ఫైనాన్షియర్ వద్ద బెల్లంకొండ సురేష్ 2018-19లో రూ. 50 లక్షలు అప్పుగా తీసుకున్నారనీ, గోపీచంద్ మలినేనితో సినిమా తీయబోతున్నట్లు చెప్పినట్లు వెల్లడించారు. ఐతే ఎన్నాళ్లకీ సినిమా ప్రారంభం కాకపోగా... తన డబ్బులు తిరిగి తనకు ఇవ్వాలని కోరితే చంపేస్తానని బెదిరిస్తున్నట్లు కోర్టుకి ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.