ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 5 మే 2021 (19:35 IST)

ఛాతి మీద పంట‌రోయ్‌, చాలామందిని కంట‌రోయ్ అంటోన్న జ్వాలారెడ్డి

jwala reddy song
గోపీచంద్, త‌మ‌న్నా జోడిగా న‌టించిన సినిమా `సీటీమార్‌`. ఇందులో మంగ్లీ పాడిన పాట మంచి ట్రెండ్‌లో వుంది. `కాస‌ర్ల శ్య‌మా్ రాసిన `జ్వాలా రెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డ‌రోయ్‌.. కారంబూదిరోయ్‌..` అంటూ సాగిన మాస్ పాట ఊపేస్తుంది. ఇందులోని సాహిత్యం ప‌క్కా మాస్‌ల‌ను అల‌రించేట్లుగా వుంది. గోరింటాకు ముద్ద‌లుగా తిన్నావా జ్వాలారెడ్డి ఇంత అందంగా వున్నావే.. అంటూ గోపీచంద్ టీజ్ చేయ‌డం, సాప‌తెచ్చుకుంట‌రో ఛాతిమీద పంట‌రోయ్‌. చాలామందిని కంట‌రోయ్.. అన్న మంగ్లీ వాయిస్‌తో త‌మ‌న్నా పై చిత్రీక‌రించిన సాంగ్ యువ‌త‌ను ఆక‌ట్టుకుంటోంది.
 
సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా 'సీటిమార్'. కబడ్డీ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్ గా గోపీచంద్, తెలంగాణ మహిళల కబడ్డీ జట్టు కోచ్ గా తమన్నా నటిస్తున్నారు. అందుకే తెలంగాణ పోరీరో, ఆంధ్ర బిడ్డ‌రోయ్ అంటూ ఇద్ద‌రికీ క‌నెక్ట్ అయ్యే ప‌దాలు ర‌చియ‌త కూర్చాడు. ఇంకా ఈ సినిమాలో భూమిక, దిగంగనా సూర్యవంశీ కీలకపాత్రల్లో కన్పించనున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ వాయిదా పడింది.
 
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు, పాటలకు మంచి స్పందన వస్తోంది. తాజాగా 'సీటిమార్'లోని 'జ్వాలారెడ్డి' సాంగ్ రికార్డు స్థాయి వ్యూస్ ను, లైక్స్ ను సొంతం చేసుకుంది. ఈ సాంగ్ కు యూట్యూబ్ లో 10+ మిలియన్ వ్యూస్, 100కే లైక్స్ వచ్చినట్టు తెలియజేస్తూ చిత్రబృందం తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేసింది. 'జ్వాలారెడ్డి' సాంగ్ ను శంకర్ బాబు, మంగ్లీ ఆలపించారు. మణిశర్మ సంగీతం అందించగా... కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "జ్వాలారెడ్డి" లిరికల్ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.