శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 ఆగస్టు 2021 (17:20 IST)

మెగాస్టార్ 154: భోళా శంకర్‌గా రానున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఆగస్టు 22వ తేదీన ఆయన అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు. 
 
ఈ చిత్రానికి ‘భోళా శంకర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ఈ మూవీ టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో చిరు విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. 
 
ఆయన ఈ సినిమాలో గుండుతో కనిపించే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవికి సోదరిగా కీర్తి సురేశ్‌ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.