శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 జూన్ 2022 (15:15 IST)

"బ్రహ్మస్త్ర" తెలుగు వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పిన చిరంజీవి

chiranjeevi
బాలీవుట్ నటీనటులు అలియా భట్, రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్‌లలో "బ్రహ్మాస్త్ర" ఒకటి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ధర్మ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది. ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్, "బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ" కోసం మెగా స్టార్ చిరంజీవి తన గాత్రాన్ని అందించారు. ఈ చిత్రానికి సంబంధించి చిరంజీవి డబ్బింగ్ చెబుతున్న టీజర్‌ను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు.
 
వీడియోలో, మెగా స్టార్ డబ్బింగ్ స్టూడియోకి స్టైల్‌గా రావడం చూడవచ్చు. డబ్బింగ్ స్టూడియోకు వచ్చిన చిరంజీవిని దర్శకుడు అయాన్ ముఖర్జీ సాదరంగా ఆహ్వానిచి స్టూడియోలోకి తీసుకెళుతున్న దృశ్యాలను చిత్ర బృందం రిలీజ్ చేశారు. డబ్బింగ్ ముగిసిన తర్వాత చిరంజీవి పాదాలకు దర్శకుడు అయాన్ ముఖర్జీ నమస్కరించడం, ఆ తర్వాత చిరంజీవి ఆలింగనం చేసుకోవడం వంటి దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి.