రామ్‌చరణ్, ఉపాసన కొనిదెల కోసం ప్రత్యేక పూజలు
Ramcharan, Upasana Konidela
రామ్‌చరణ్ & ఉపాసన కొనిదెల జీవిత భాగస్వామ్యం జులై 14కు పదేళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా వారు బాగుండాలని రామ్‌చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ప్రక్టనలో పేర్కొన్నారు. 10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లప్పుడూ రామ్‌చరణ్ అభిమానులు భారీ వేడుకలు జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో పండ్లు, దుస్తలు పంపిణీ కార్యక్రమం జరగనుంది. అదేవిధంగా వికలాంగులకు భోజనసదుపాయాలు చేయనున్నారు. రామ్‌చరణ్ దంపతులు బాగుండాలని అభిమాన సంఘాల నాయకులు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు కూడా పాల్గొననున్నారు. ఇటీవలే ఆర్.ఆర్.ఆర్. విజయం తర్వాత రామ్‌చరణ్ శంకర్ దర్శకత్వంలో భారీ సినిమా చేస్తున్నారు. త్వరలోనే తాజా షెడ్యూల్ జరగనుంది.