మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 20 మే 2022 (18:29 IST)

ఒన్స్ అపాన్ ఏ టైమ్‌.. ఘోస్ట్‌..అంటూ విడుద‌లైన విక్ర‌మ్ ట్రైల‌ర్ అదుర్స్‌ (video)

Vikram sitll
Vikram sitll
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్' కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా నటించడమే కాకుండా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ పవర్ ఫుల్ పాత్రలలో కనిపించనుండగా సూర్య అతిధి పాత్రలో అలరించనున్నారు. 
 
కాగా, శుక్ర‌వారంనాడు రామ్‌చ‌ర‌ణ్ విక్ర‌మ్‌ను ట్రైల‌ర్‌ను సోష‌ల్‌మీడియా ద్వారా ఆవిష్క‌రించారు. ఇందులో ఏముందంటే,
అడ‌వి అన్నాక పులి, సింహం అన్నీ వేట‌కు వెళ‌లాయి.  జింక త‌ప్పించుకోవాల‌ని చూస్తుంది. ఆలోపు సూర్య‌స్త‌మ‌యం అయితే. సూర్యోద‌యం చూసేది ఎవ‌ర‌నేది ప్ర‌కృతి నిర్ణ‌యిస్తుంది. కానీ ఈ అడ‌విలో మాత్రం వెలుగు ఎక్క‌డ‌నేది నిర్ణ‌యించేది ప్ర‌కృతికాదు. నేనే.. అంటూ.. వాయిస్ ఓవ‌ర్ రావ‌డం, ఆ త‌ర్వాత క‌మ‌ల్ హాస‌న్‌, విజ‌య్ సేతుప‌తి రెండు వ‌ర్గాలుగా తుపాకుల‌తో ఫైరింగ్ చేయ‌డం, మ‌ధ్య‌లో ఫాజిల్ వ‌చ్చి ప్ర‌శ్నించ‌డం.. చ‌క‌చ‌కా జ‌రిగిపోతాయి. ఫైన‌ల్‌గా.. ఒన్స్ అపాన్ ఏ టైమ్‌.. ఘోస్ట్‌.. అనే డైలాగ్‌తో ట్రైల‌ర్ ముగుస్తుంది. ఇది పూర్తి యాక్ష‌న్‌తోకూడిన సందేశాత్మ‌క చిత్రంగా అనిపిస్తుంది.

 

 
ఇదిలా వుండ‌గా, ఈ చిత్రాన్ని తెలుగులో నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఫ్యాన్సీ ధరకు 'విక్రమ్' తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రం జూన్ 3న తమిళంతో పాటు తెలుగులోనూ గ్రాండ్‌గా విడుదల కానుంది. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యుషన్ సంస్థలలో ఒకటైన శ్రేష్ట్ మూవీస్ 'విక్రమ్' సినిమాకి సంబంధించి భారీ ప్రమోషనల్ కార్యక్రమాలని ప్లాన్ చేస్తుంది.  
 
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.  
 
ప్రధాన తారాగణంలో పాటు కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలలో కనిపించనున్ననారు.
 
తారాగణం: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, కాళిదాస్ జయరామ్, నరేన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ తదితరులు
సాంకేతిక విభాగం :
దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్
బ్యానర్: రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్
సంగీతం : అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్