1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 మే 2022 (15:29 IST)

హిందీని నేర్చుకోవచ్చు.. తమిళం వర్థిల్లాలి : కమల్ హాసన్

kamal haasan
ప్రతి ఒక్కరూ హిందీతో పాటు అన్ని భాషలను నేర్చుకోవచ్చని అదేసమయంలో మాతృభాషకు మాత్రం ఎవరైనా ద్రోహం చేస్తే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోనని విశ్వనటుడు కమల్ హాసన్ ప్రకటించారు. 
 
తన కొత్త చిత్రం విక్రమ్ చిత్రం ట్రైలర్ రిలీజ్ వేడుక జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ, తన మాతృభాషకు ఎవరు అడ్డొచ్చినా ఎదుర్కొంటానని దీనికి రాజకయాలతో సంబంధించి ఏమీ లేదని అన్నారు. 
 
తాను హిందీకి వ్యతిరేకిని కాదని అన్నారు. తన మాతృభాష తమిళం అని, ఆ భాష వర్థిల్లాలలని చెప్పడం తన బాధ్యత అని తెలిపారు. మాతృభాషను ఎవరూ మరవకూడదని ఆయన వెల్లడించారు. కాగా, సినిమా, రాజకీయం కవల పిల్లలని, తాను రెండింటిలోనూ ఉన్నారని గుర్తు చేశారు. గుజరాతీ, చైనీస్ భాషలు కూడా నేర్చుకుని, మాట్లాడవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.