గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 ఫిబ్రవరి 2022 (14:48 IST)

గ్రూపు ఫోటోలో ఎన్టీఆర్ మిస్సింగ్ - దూరం పెట్టేశారా?

తెలుగు చిత్రపరిశ్రమ ఎందుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలోని సినీ ప్రముఖులు గురువారం ఏపీ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో హీరోలు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, ఆర్.నారాయణ మూర్తి, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అలీ, పోసాని కృష్ణమురళి తదితరులు ఉన్నారు. 
 
అయితే, వీరంతా హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌లో విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ నుంచి వారు కారులో సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అయితే, విమానంలో వారు దిగిన గ్రూపు ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
పైగా ఈ రోజు మహేష్ బాబు - నమ్రతల పెళ్లి రోజు కావడంతో ఆయనకు విమానంలోనే చిరంజీవి, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ శుభాకాంక్షలు తెలిపుతూ పుష్పగుచ్చం అందించారు. అయితే ఈ భేటీకి జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఆయన విమానంలోనూ, తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోనూ కనిపించకపోవడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. 
 
ఈ సందర్భంగా చిత్రపరిశ్రమ సమస్యలతో పాటు సినిమా టిక్కెట్ ధరల తగ్గింపుపై ప్రధానంగా చర్చించారు. ఇటీవల ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ జీవో జారీచేసింది. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. దీంతో రేట్లు పెంచాలంటూ సినీ పరిశ్రమ పెద్ద మొరపెట్టుకుంటూ వచ్చారు. ముఖ్యంగా, పెద్ద సినిమాల విడుదల సమయంలో ఒక వారం రోజుల పాటు టిక్కెట్ ధరలు పెంచుకునేలా వెసులుబాటును కల్పించాలని నిర్మాతలు కోరుతున్నారు.